తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను సీఎం కేసీఆర్ అక్టోబర్ 29న మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం పూర్వం ఉన్నా ccla వెబ్ సైట్ లో ఉన్నా ROR-1B, పహణి వివరాలను తెలంగాణ ప్రభుత్వం తొలిగించింది. అయితే, వాటి స్థానంలో ROR-1B, పహణి వివరాలను తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ లో పొందుపర్చింది. అయితే, ఆ వివరాలు ఎలా తెలుసుకోవలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ధరణి పోర్టల్ ని ఓపెన్ చేశాక అందులో మీకు Land Details Serch అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మీకు మన భూమి పాస్ బుక్, ఆధార్ యొక్క మొదటి 4 నెంబర్లు ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మనం దగ్గర భూమి పాస్ బుక్, ఆధార్ నెంబర్ కనుక లేనట్లయితే మీ జిల్లా, మండలం, గ్రామం పేరు, సర్వే నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు వివరాలు సమార్పించాక మీకు భూమి యొక్క విస్తీర్ణం, భూమి మార్కెట్ వాల్యూ వంటి వివరాలు కనిపిస్తాయి. మనకు ROR-1B వివరాలు అవసరం అనుకుంటే మొదట చెప్పినట్లు భూమి పాస్ బుక్, ఆధార్ యొక్క మొదటి 4 నెంబర్లు ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా పట్టాదారు పాసు పుస్తకం నమూనా మరియు ROR-1B వంటి వివరాలను సులభంగ పొందవచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.