ఆధార్ కార్డు కోసం మీరు గంటల కొద్ది ఆధార్ సేవా కేంద్రాల ముందు క్యూలో నిలబడుతున్నారా? అయితే, మీకు ఒక గుడ్ న్యూస్ ఇక నుండి గంటల కొద్ది క్యూలో నిలబడకుండా పాస్‌పోర్ట్ మాదిరిగానే ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుత కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆన్‌లైన్ ఆధార్ స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఏఐ) కల్పించింది. ఈ సౌకర్యం బుక్ చేసుకున్న స్లాట్ కు 30 నిమిషాల ముందు చేరుకోవాలని పేర్కొంది. ఈ సౌకర్యం ద్వారా మీరు గంటల కొద్ది క్యూలలో నిలబడవలసిన అవసరం లేదని పేర్కొంది.

ఇంకా చదవండి: పాన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు

అపాయింట్​మెంట్​ బుక్ చేసుకోండిలా..

  • బుకింగ్ కోసం ముందుగా ఆన్​లైన్​లో www.uidai.gov.in ని ఓపెన్ చేయండి.
  • “My Aadhar” డ్రాప్-డౌన్ మెను కింద “Book an Appointment” పై క్లిక్ చేయండి.
  • డ్రాప్-డౌన్ మెనులో మీకు దగ్గరలో ఉన్నా స్థానాన్ని ఎంచుకొని “Proceed to Book Appointment“పై క్లిక్ చేయండి.
  • అక్కడ ఫోన్ నంబర్​ను ఎంటర్ చేసి.. వెరెఫికేషన్ కోసం ఫోన్​కు వచ్చే ఓటీపీని సమర్పించాలి.
  • ఇప్పుడు మీ ఆధార్ వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాలి.
  • మీకు నచ్చిన తేదీ, సమయాన్ని ఎంచుకోండి.
  • అప్పుడు ఓ అపాయింట్​మెంట్ నంబర్ వస్తుంది.
  • ఆధార్ సేవా కేంద్రం పాస్​పోర్ట్ సేవా కేంద్రం లాగే పనిచేస్తుంది. ఇక్కడ ఒక టోకెన్ వ్యవస్థ ఉంటుంది.ముందుగా టోకెన్ తీసుకొని డాక్యుమెంట్లను చెక్ చేయించుకోవాలి. ధృవీకరణ పూర్తయిన తర్వాత ఛార్జీల చెల్లింపు కోసం క్యాష్ కౌంటర్​కు వెళ్లాలి.
  • ఆ తర్వాత మీకు కేటాయించిన వర్క్ ఆపరేటర్ కౌంటర్ దగ్గర టోకెన్ నంబర్లు ప్రదర్శిస్తారు. మీ టోకెన్ సంఖ్య వచ్చినప్పుడు ఆపరేటర్ దగ్గరికి వెళ్లాలి.

ప్రస్తుతం కేవలం కొత్త ఆధార్ కార్డు, పేరు మార్పు, చిరునామా మార్పు, మొబైల్ నంబర్​, ఈమెయిల్ ఐడీ, డేట్ ఆఫ్ బర్త్​ మార్పు, బయో మెట్రిక్​ (ఫొటో, ఫింగర్​ప్రింట్​, ఐరిస్​) నమోదు కోసం మాత్రమే ఆన్​లైన్​లో అపాయింట్​మెంట్​ బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తుంది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ని  Subscribe చేసుకోండి.