దేశంలోని ఓటర్లందరికీ శుభవార్త. భారత ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డ్(ఈ-ఎపిక్) కార్డును అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జనవరి 25న మన దేశ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దీనిని ప్రారంభించారు. ఇప్పుడు మీ ఓటర్ ఐడీ కార్డును డిజిటల్ కార్డు రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ-ఎపిక్ కార్డు అనేది సురక్షితమైన పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్(పీడీఎఫ్) వెర్షన్. దీనిలో ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.(ఇంకా చదవండి: వాట్సాప్ కి పోటీగా అదిరిపోయే ఫీచర్స్ తీసుకొచ్చిన సిగ్నల్ యాప్!)
మీ మొబైల్ లేదా కంప్యూటర్‌లో పీడీఎఫ్ ఫార్మాట్ లో దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డును మీరు మీ మొబైల్ లేదా డిజి లాకర్‌లో పిడిఎఫ్‌గా అప్‌లోడ్ చేయవచ్చు లేదా ప్రింట్ తీసుకొని భద్రంగా ఎక్కడైనా సేవ్ చేసుకోవచ్చు. ఈ డిజిటల్ ఓటర్ ఐడీ చూపించి ఎన్నికల్లో ఓటు కూడా వేయొచ్చు. అంటే ఓటర్ ఐడీ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. మొదట కొత్త ఓటర్ కార్డు కోసం నవంబర్-డిసెంబర్ 2020 సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు 2021 జనవరి 25 నుంచి ఈ-ఎపిక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మిగతా సాధారణ ఓటర్లు అందరూ ఫిబ్రవరి 1 నుంచి ఈ-ఎపిక్ కార్డును Voter Portal: http://voterportal.eci.gov.in/ లేదా NVSP: https://nvsp.in/ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు కాకుండా సాదారణ ఓటర్లు అందరూ మొదట ఈ-కేవైసి పూర్తి చేసుకోవాలి.
డిజిటల్ ఓటర్ ఐడి పూర్తి సమాచారం!
మీకు ఓటర్ ఐడీ నెంబర్ తెలియకపోయినా ఈ-ఎపిక్ కార్డును http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ పోర్టల్స్‌లో మీ పేరు సెర్చ్ చేసి డౌన్‌లోడ్ చేయొచ్చు. అలాగే ఫామ్ 6 రిఫరెన్స్ నెంబర్ ఉపయోగించి ఈ-ఎపిక్ డౌన్‌లోడ్ చేసే అవకాశం కల్పిస్తోంది ఎన్నికల కమిషన్. e-EPIC డౌన్‌లోడ్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని పోలింగ్ స్టేషన్‌లో చూపించి ఓటు వేయవచ్చు. (ఇంకా చదవండి: ట్రెండింగ్: ఆ టెక్నాలజీ కనిబెడితే రూ.730కోట్లు మీ సొంతం!)
http://voterportal.eci.gov.in/ లేదా https://nvsp.in/ లేదా Voter Helpline Mobile App ప్లాట్‌ఫామ్స్ ద్వారా e-EPIC డౌన్‌లోడ్ చేయొచ్చు. లాగిన్ అయిన తర్వాత Download e-EPIC పైన క్లిక్ చేయాలి. EPIC నెంబర్ లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి e-EPIC డౌన్‌లోడ్ చేయాలి.
మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయకపోతే e-KYC పూర్తి చేయాలి. e-KYC అంటే మీ ఫోటో క్యాప్చర్ చేసి EPIC డేటాతో కంపేర్ చేస్తారు. ఒకవేల e-KYC ఫెయిల్ అయితే ఈఆర్‌ఓ ఆఫీసుకు వెళ్లి ఫోటో ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేసి, మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. మొబైల్ నెంబర్ అప్‌డేట్ లేకపోతే? e-KYC ద్వారా మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. e-KYC పూర్తైన తర్వాతే డౌన్‌లోడ్ చేయొచ్చు. కుటుంబ సభ్యులందరూ ఒకే మొబైల్ నెంబర్ ఉపయోగించొచ్చు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.