Sunday, November 24, 2024
HomeGovernmentమీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఎలా..?

మీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం ఎలా..?

మీరు మీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నారా? ఇందుకోసం మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా సులభంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ యొక్క వెబ్ సైట్ ద్వారా ఈ ఈపీఎఫ్ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. కేవలం ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే చాలు.

మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లోనే పరిశీలించి మీ అకౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తుంది ఈపీఎఫ్ఓ. మీరు మీ పాత ఈపీఎఫ్ అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలంటే పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ఫామ్, ఫామ్ 13 లాంటివి సబ్మిట్ చేయడంతో పాటు మీకు తగిన అర్హతలు ఉండాలి. అసలు ఈ ప్రాసెస్ ని ఎలా పూర్తి చేయాలో తెలుసుకుందాం.

ఆన్లైన్ లో ఈ విదానానికి ముందు తప్పనిసారిగా మీ యూఏఎన్ నెంబర్ ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న యాజమాన్యానికి సంబంధించిన వివరాలు ఉండాలి. అకౌంట్ నెంబర్, ఎస్టాబ్లిష్‌మెంట్ నెంబర్, మీ పాత ఈపీఎఫ్ అకౌంట్, కొత్త ఈపీఎఫ్ అకౌంట్, సాలరీ అకౌంట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫామ్ 13 లాంటి వివరాలు తప్పనిసరి. ఇక వీటితో పాటు యూఏఎన్ నెంబర్ యాక్టీవ్‌గా ఉండాలి.

మీ సాలరీ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉండాలి. అప్పుడే మీ ఎంప్లాయర్ సులువుగా మీ ఈపీఎఫ్ అకౌంట్‌ని ట్రాన్స్‌ఫర్ చేయడం కుదురుతుంది. మీ యూఏఎన్‌కు ఆధార్ నెంబర్ తప్పనిసరిగా లింకై ఉండాలి. మీ మెంబర్ ఐడీకి ఒకే ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టడం సాధ్యమవుతుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రాసెస్ మొదలుపెట్టొచ్చు.

ముందుగా మనం https://unifiedportal-mem.epfindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. ఆ తర్వాత Online Services పైన క్లిక్ చేయాలి. అందులో Transfer Request ఆప్షన్ ఎంచుకోవాలి. పాత ఈపీఎఫ్ అకౌంట్ మెంబర్ ఐడీ సబ్మిట్ చేయాలి. మీ యూఏఎన్, మెంబర్ ఐడీ ఎంటర్ చేయాలి. Get OTP పైన క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

- Advertisement -

ఆ తర్వాత 10 రోజుల్లో ఆన్‌లైన్ పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్‌ను పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీ ప్రస్తుత ఎంప్లాయర్‌కు ఇవ్వాలి. ప్రస్తుత ఎంప్లాయర్ అప్రూవ్ చేయగానే మీ పాత పీఎఫ్ అకౌంట్ సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ట్రాకింగ్ ఐడీ కూడా వస్తుంది. ఆ ఐడీతో Online Services సెక్షన్‌లో Track Claim Status ఆప్షన్ సెలెక్ట్ చేసి స్టేటస్ ట్రాక్ చేయొచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles