PAN Aadhaar Linking: శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)తో ఆధార్‌ను లింకు చేయడానికి విధించిన గడువును కేంద్రం మరో మూడు నెలల పాటు పొడిగించింది. మార్చి 31 వరకు ఉన్న గడువు తేదీని జూన్ 30 దాకా పెంచుతున్నట్లు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ట్విట్టర్ ద్వారా తెలిపింది. రెండో దశ కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న పరిణామాల నేపథ్యంలో ఆఖరు తేదీని పొడిగించాలంటూ పన్ను చెల్లింపు దారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి దీనికి ముందుగా నిర్దేశించిన గడువు మార్చి 31. అలాగే, పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్ స్కీమ్’ గడువు మార్చి 31తో ముగిసింది.(ఇది చదవండి: 5 నిమిషాల్లో ఆన్లైన్ లో పాన్-ఆధార్ లింక్ చేయండిలా?)
గతేడాది ఆగస్టు నాటి గణాంకాల ప్రకారం 50.95 కోట్ల పాన్ కార్డులు ఉండగా 32.71 కోట్ల పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానించారు. గడువు తర్వాత పాన్-ఆధార్ నెంబర్ లింక్ చేసినట్టైతే రూ.1,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్దిక బిల్లు 2021లో నిబంధనను విధించింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు మరోసారి అవకాశం కల్పించింది. పాన్ కార్డ్-ఆధార్ లింక్ చేసినట్లయితే ఈ-ఫైలింగ్ పోర్టల్ లింకు క్లిక్ చేసి ఆధార్, పాన్ నెంబర్ సమర్పించి స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.