కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది జీవితాలు రోడ్డు మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కారణం కరోనా వల్ల చనిపోయే వారు భీమా కిందకు రాకపోవడమే. అందుకే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు బీమా ప్రయోజనాన్ని అంధించడం కోసం కేంద్ర ప్రభుత్వం 1976లో ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్(ఈడీఎల్ఐ) స్కీమ్ ప్రవేశ పెట్టింది. అయితే, చాలా తక్కువ మందికి మాత్రమే ఈ స్కీమ్ ఒకటి ఉంది అని తెలుసు.

ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద అందించే బీమా మొత్తాన్ని 28.04.2021 నుంచి పెంచుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. ఇకపై పీఎఫ్ ఖాదారులకు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద రూ.7 లక్షల వరకు ఇప్పుడు బీమా వర్తిస్తుంది.

ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్(ఈడీఎల్ఐ) స్కీమ్

ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్(ఈడీఎల్ఐ) స్కీమ్ అనేది ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగుల కొరకు ఈపీఎఫ్ఓ(ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ద్వారా అందించే ఒక భీమా పథకం. తను ఉద్యోగం చేస్తున్న సమయంలో బీమా చేసిన వ్యక్తి(ఉద్యోగి) మరణించినట్లయితే వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు రిజిస్టర్డ్ నామినీ ఖాతాలో రూ.7 లక్షల వరకు జమచేస్తారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ & ఇతర నిబంధనల చట్టం, 1952 కింద రిజిస్టర్ చేసుకున్న అన్ని సంస్థలకు ఈడీఎల్ఐ వర్తిస్తుంది. ఆ సంస్థలు అన్నీ వారి ఉద్యోగులకు జీవిత బీమా ప్రయోజనాలను అందించాలి. ఈ పథకం ఈపీఎఫ్, ఈపీఎస్ కలయికతో పనిచేస్తుంది. ఉద్యోగి చివరి వేతనం ఆధారంగా ఈ ప్రయోజనం అందిస్తారు.

 • నెలకు రూ.15,000/-లోపు ప్రాథమిక వేతనం(Basic Salary) ఉన్న ఉద్యోగులందరికీ ఈడీఎల్ఐ వర్తిస్తుంది.
 • ఒకవేళ ప్రాథమిక వేతనం నెలకు రూ.15,000 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే గరిష్ట బెనిఫిట్ రూ.7,00,000/-గా ఉంటుంది.
 • 28.04.2021 నుంచి అమల్లోకి వచ్చిన ఈపీఎఫ్ఓ గరిష్ట ప్రయోజనాన్ని రూ.7 లక్షలకు పెంచింది.
 • ఈడీఎల్ఐకి ఉద్యోగులు సహకారం అందించాల్సిన అవసరం లేదు. ఈపిఎఫ్ కొరకు మాత్రమే వారి కంట్రిబ్యూషన్ అవసరం అవుతుంది.
 • 20 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏదైనా సంస్థ ఈపీఎఫ్ కొరకు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
 • అందువల్ల, ఈపీఎఫ్ ఖాతా ఉన్న ఏ ఉద్యోగి అయిన స్వయం చాలకంగా(automatic) ఈడీఎల్ఐ పథకానికి అర్హత కలిగి ఉంటారు.
 • యజమాని మరో గ్రూపు బీమా పథకాన్ని ఎంచుకోవచ్చు, అయితే సంస్థ అందించే ప్రయోజనాలు ఈడీఎల్ఐ కింద అందించే ప్రయోజనాలకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి.
 • ఈడీఎల్ఐ నిబంధనల ప్రకారం, యజమాని కంట్రిబ్యూషన్ ప్రాథమిక వేతనంలో 0.5% లేదా ప్రతి ఉద్యోగికి నెలకు గరిష్టంగా రూ.75 ఉండాలి. ఒకవేళ ఇతర గ్రూపు బీమా పథకం లేనట్లయితే, గరిష్ట కంట్రిబ్యూషన్ నెలకు రూ.15,000/- వద్ద ఉంటుంది.
 • ఈడీఎల్ఐ కేటాయింపులు డియర్ నెస్ అలవెన్స్(కరువు భత్యం) + ప్రాథమిక వేతనం(Basic salary) ఆదారంగా లెక్కిస్తారు.

ఈడీఎల్ఐ ఛార్జ్ ఎలా లెక్కిస్తారు?

బీమా చేసిన వ్యక్తి మరణించినట్లయితే రిజిస్టర్డ్ నామినీ ఖాతాలో భీమా డబ్బును జమ చేస్తారు. ఒకవేళ నామినీ లేదా లబ్ధిదారుడు రిజిస్టర్ కానట్లయితే, అప్పుడు ఆ మొత్తం చట్టపరమైన వారసుడికి చెల్లించబడుతుంది. దిగువ పేర్కొన్నవిధంగా ఈడీఎల్ఐ లెక్కిస్తారు.

{గత 12 నెలల పాటు ఉద్యోగి సగటు నెలవారీ వేతనం(రూ.15,000 * 30 = 4,50,000) } + బోనస్ మొత్తం (రూ.2,50,000/-)}
అందువల్ల, ఈడీఎల్ఐ కింద గరిష్ట చెల్లింపు రూ. 7,00,000/-గా ఉంటుంది.

ఈడీఎల్ఐ క్లెయిం ప్రాసెస్ కోసం కావాల్సిన పత్రాలు

 • ఫారం 5 ఐఎఫ్ లో పూర్తిగా వివరాలు నింపాలి.
 • బీమా చేసిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్
 • ఒకవేళ లీగల్ వారసుడు క్లెయిం ఫైల్ చేసినట్లయితే వారసత్వ సర్టిఫికేట్.
 • సహజ సంరక్షకుడు కాకుండా మరో వ్యక్తి మైనర్ తరఫున క్లెయిం దాఖలు చేసినట్లయితే గార్డియన్ షిప్ సర్టిఫికేట్.
 • పేమెంట్ అందుకోవలసిన ఖాతా కొరకు క్యాన్సిల్ చేయబడ్డ చెక్కు కాపీ

ఈడీఎల్ఐ ప్రయోజనాల కోసం ఎలా క్లెయిం చేయాలి?

 1. బీమా చేసిన వ్యక్తి పేర్కొన్న నామినీ ఈడీఎల్ఐ క్లెయిం చేసుకోవచ్చు.
 2. ఒకవేళ నామినీ రిజిస్టర్ కానట్లయితే, అప్పుడు కుటుంబ సభ్యులు లేదా చట్టపరమైన వారసులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
 3. మరణించిన వ్యక్తి మరణించిన సమయంలో ఈపీఎఫ్ ఖాతాలో కంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి.
 4. ఈడీఎల్ఐ ఫారం 5 ఒకవేళ హక్కుదారుడు పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
 5. క్లెయిం ఫారంపై యజమాని సంతకం చేసి సర్టిఫై చేయాల్సి ఉంటుంది.
 6. యజమాని లేనట్లయితే లేదా యజమాని సంతకం పొందలేనట్లయితే, ఫారం దిగువ పేర్కొన్న వారి ద్వారానైనా ధృవీకరింఛాలి:
 7. బ్యాంకు మేనేజర్(ఎవరి బ్రాంచీలో అకౌంట్ మెయింటైన్ చేయబడిందో)
 8. స్థానిక ఎంపీ లేదా ఎమ్మెల్యే
 9. గెజిటెడ్ ఆఫీసర్
 10. మేజిస్ట్రేట్
 11. స్థానిక మునిసిపల్ బోర్డు సభ్యుడు/ఛైర్మన్/సెక్రటరీ
 12. పోస్ట్ మాస్టర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్
 13. ఈపీఎఫ్ లేదా సీబీటీ రీజనల్ కమిటీ సభ్యుడు
 14. క్లెయిం ప్రాసెసింగ్ కొరకు క్లెయిం దారుడు పూర్తి చేసిన ఫారంతో పాటుగా అన్ని డాక్యుమెంట్లను రీజనల్ ఈపీఎఫ్ కమిషనర్ ఆఫీసుకు వెళ్లి సబ్మిట్ చేయాలి.
 15. ఈపీఎఫ్, ఈపీఎస్, ఈడీఎల్ఐ అనే మూడు స్కీంల ప్రయోజనాలను క్లెయిం చేసుకోవడానికి క్లెయిం దారుడు ఫారం 20(ఈపీఎఫ్ విత్ డ్రా క్లెయిం కొరకు) అదేవిధంగా ఫారం 10సీ/డీని కూడా సబ్మిట్ చేయవచ్చు.
 16. క్లెయిం ప్రాసెస్ చేయడం కొరకు అవసరమైన ఏవైనా అదనపు డాక్యుమెంట్లను సాధ్యమైనంత త్వరగా అందించాలి.
 17. అన్ని డాక్యుమెంట్లు అందించి క్లెయిం ఆమోదించిన తర్వాత, క్లెయిం అందుకున్న 30 రోజుల్లోగా ఈపీఎఫ్ కమిషనర్ క్లెయింను సెటిల్ చేయాలి.
 18. లేనిపక్షంలో, హక్కుదారుడికి ఏడాదికి వడ్డీ @12% శాతం లభిస్తుంది. (ఆమోదం/రిజెక్ట్ అయ్యే వరకు)

ఈపీఎస్, ఈపీఎఫ్, ఈడీఎల్ఐలకు ఉద్యోగి & యజమాని సహకారం

ఉద్యోగుల తరఫున యజమాని ఈ పథకాలలో నగదు జమ చేస్తాడు. ఉద్యోగి కంట్రిబ్యూషన్ వారు వేతనాన్ని క్రెడిట్ చేయడానికి ముందు వేతనం నుంచి మినహాయిస్తారు. ఉద్యోగులు ఈ పథకాలకు నేరుగా ఎలాంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగుల, యాజమానుల కంట్రిబ్యూషన్ ఈ క్రింది విధంగా ఉంటుంది.

ఉద్యోగి ఈపీఎఫ్ వాటా – 12%, యజమాని ఈపీఎఫ్ వాటా – 3.67%
ఉద్యోగి ఈపీఎస్ వాటా – ఏదీ కాదు, యజమాని ఈపీఎస్ వాటా – 8.33% లేదా రూ. 1,250/-
ఉద్యోగి ఈడీఎల్ఐ వాటా – ఏదీ కాదు, యజమాని ఈడీఎల్ఐ వాటా – 0.50 లేదా గరిష్టంగా రూ. 75/-

పాలసీదారుడి(మరణించిన వ్యక్తి) కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈడీఎల్ఐ పథకం ప్రధాన ఉద్దేశ్యం. కుటుంబ సభ్యులు అంటే జీవిత భాగస్వామి, అవివాహిత కుమార్తె లేదా మగ బిడ్డ అంటే 25 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే వర్తిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here