PM Garib Kalyan Yojana: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ లు విధించాయి. ఈ లాక్ డౌన్ వల్ల పని దొరక్క పేద ప్రజలు ఆకలితో అలమటించి పోతున్నారు. అయితే, కరోనా సంక్షోబాన్ని దృష్టిలో పెట్టుకొని మే, జూన్ నెలల్లో పేదలకు ఉచితంగా రేషన్ అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద 5 కిలోల ఆహార ధాన్యాలు పేదలకు ఉచితంగా లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశంలోని 80 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కూడా కరోనా సంక్షోబాన్ని దృష్టిలో పెట్టుకొని దేశంలోని పేదలకు ఉచిత రేషన్ అందించిన విషయం తెలిసిందే. అయితే, కొందరు రేషన్ డీలర్లు వాటిని పేదలకు అందకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేల మీ గ్రామంలో కూడా మీకు రేషన్ కార్డు ఉన్న రేషన్ డీలర్లు మీ కోటా చెల్లించడానికి నిరాకరిస్తే మీరు ప్రభుత్వానికి చెందిన టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.(ఇది కూడా చదవండి: వాహనదారులకు శుభవార్త అందించిన కేంద్రం!)
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పోర్టల్(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను కలిగి ఉంది. మీరు డీలర్లకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలనికుంటే ఫోన్ చేసి తెలుపవచ్చు. అలాగే మెయిల్ చేసే సదుపాయం కూడా ఉంది. NFSA వెబ్‌సైట్(https://nfsa.gov.in)కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. పోర్టల్ ఓపెన్ చేశాక కుడి భాగంలో ఆన్లైన్ కంప్లయింట్(Online Complaint) కింద ఉన్న హెల్ప్‌లైన్ టెలీఫోన్ నంబర్స్ క్లిక్ చేసి మీ రాష్ట్రానికీ చెందిన నంబర్లు తెలుసుకోవచ్చు. రేషన్ కార్డు దారులు తన ఫుడ్ కోటాను అందుకోకపోతే అతను ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
హెల్ప్‌లైన్ నంబర్లు:
ఆంధ్రప్రదేశ్ – 7093001872, 04023494822, 04023494808, 18004252977, 1967.
తెలంగాణ – 04023310462, 180042500333, 1967.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.