Wednesday, November 20, 2024
HomeGovernmentపీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!

పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ-కేవైసి చేయకపోతే రూ.2 వేలు రానట్లే..!

PM KISAN e-KYC: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్) పథకం కింద 10వ విడత నగదును అతి త్వరలో రైతుల ఖాతాలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దం అవుతుంది. అయితే, ఈ సారి రైతుల ఖాతాలో డబ్బులు వేయడానికి ముందు సరికొత్త రూల్ అమలులోకి వచ్చింది. ఇక నుంచి ప్రతి విడత రూ.2000 వేలను రైతులు ఖాతాలో జమ చేయాలంటే కచ్చితంగా ఈ-కేవైసి(PM KISAN e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఈ-కేవైసీ(PMKISAN e-KYC) ప్రక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ నెంబర్ లను ప్రధాన మంత్రి-కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాలి, లేకపోతే ఆ విడతకు చెందిన(ఉదా: 11వ విడత) డబ్బులు రైతుల ఖాతాలో జమ కావు. పీఎం కిసాన్ లబ్దిదారులందరూ 11వ విడత తుది గడువు మే 31, 2022 లోపల ఈ-కేవైసీ పూర్తి చేయాలని ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 11వ వాయిదాను పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీని పూర్తి చేయాలి.

పీఎం కిసాన్ ఈ-కేవైసి(PMKISAN e-KYC) ప్రక్రియ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు.

  1. ఆధార్-మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా
  2. సీఎస్‌సీ కేంద్రాల వల్ల బయోమెట్రిక్ నమోదు చేసి

1) ఆధార్-మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా ఈ-కేవైసి

  • మొదట పీఎం కిసాన్(pmkisan.gov.in) అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు ఫార్మర్ కార్నర్ కింద గాల ‘ఈ-కేవైసి’ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
  • తర్వాత ఆధార్ కార్డు నెంబరు, క్యాప్చా కోడ్ నమోదు చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి.
  • మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ‘Get OTP’ మీద క్లిక్ చేయండి.
  • ఇప్పుడు, నిర్ధిష్ట ఫీల్డ్ ఓటీపీ నమోదు చేసిన తర్వాత “Submit For Auth” మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ పీఎమ్ కిసాన్ ఖాతాతో లింకు అవుతుంది.

2) సీఎస్‌సీ కేంద్రాల వల్ల బయోమెట్రిక్ నమోదు చేసి

మీ మొబైల్ నెంబర్ ఆధార్ తో లింకు కాకపోతే, మీ దగ్గరలోని సీఎస్‌సీ కేంద్రాలకు వెళ్లి పీఎమ్ కిసాన్ ఈ-కేవైసి కోసం వచ్చినట్లు పేర్కొనండి. వారు మీ బయోమెట్రిక్ తీసుకొని ఈ-కేవైసి ప్రక్రియను పూర్తి చేస్తారు.

- Advertisement -

పీఎమ్ కిసాన్ ఈ-కేవైసి చేసే ముందు మీరు ఇంతక ముందే ప్రక్రియ పూర్తి చేసుకున్నారా లేదో ఈ క్రింద పేర్కొన్న లింకు ద్వారా తెలుసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles