Friday, March 29, 2024
HomeHow ToPM KISAN 11th Installment Status Check: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఖాతాలో...

PM KISAN 11th Installment Status Check: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి ఇలా?

PM KISAN 11th Installment Status Check: నైరుతి రుతు పవనాలు దేశంలోకి ప్రవేశించడంతో పొలం సాగు పనులు మొదలు పెట్టిన రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధాన్‌ మంత్రి కిసాన్‌ సమ్మా న్ నిధి యోజన(PM Kisan Samman Nidhi Yojana) కింద పథకం కింద 11వ విడత డబ్బులను కేంద్రం నేటి నుంచి రైతుల ఖాతాలో జమ చేయడం ప్రారంభించింది. పీఎం కిసాన్(PMKISAN) పథకం కింద 10 కోట్ల మంది పైగా రైతుల ఖాతాలో దాదాపు 21,000 కోట్ల రూపాయలను ప్రధాని నరేంద్ర మోడీ నేడు విడుదల చేశారు.

నేటితో పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు ముగింపు

మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్-PMKISAN) పథంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6,000 అందిస్తున్నది. ఏడాదికి మూడు విడతచొప్పున ఇప్పటి వరకు 10 విడతాల డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అయితే, నేటి నుంచి 11వ విడత డబ్బులు కూడా రైతుల ఖాతాలో దశల వారీగా జమ కానున్నాయి. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అత్యంత కీలకమైన ఈ-కేవైసీ పూర్తి చేసే గడువు కూడా నేటితో(మే 31తో) ముగియనుంది.

పీఎం కిసాన్ నగదు ఖాతాలో పడకపోతే ఏమి చేయాలి?

మీరుఈ పథకానికి అన్నీ విధాలా అర్హులైన పీఎం కిసాన్ నగదు మీ ఖాతాలో జమకాకపోతే ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్‌లకు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం PMKISAN HelpDesk Number – 011-24300606,155261కు కాల్ చేయవచ్చు. PMKISAN TollFree Number – 18001155266కు కూడా కాల్ చేయవచ్చు.

ఇది కాకుండా ఇమెయిల్ ఎంపిక కూడా ఉంది. pmkisan-ict@gov.in. మరియు pmkisan-funds@gov.inకు మెయిల్ చేయడం ద్వారా PM కిసాన్ యోజన 11వ విడతకు డబ్బు అందకపోవడానికి గల కారణాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇక పీఎం కిసాన్ నగదు మొత్తం అందుకోకపోవడానికి ప్రధాన కారణాలలో ఈ-కెవైసీ పూర్తి చేయడం కూడా కావచ్చు. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులందరూ మే 31లోపు ఇ-కెవైసి చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

పీఎం కిసాన్ డబ్బులు ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి ఇలా?

  • https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx లింక్‌ను క్లిక్‌ చేయాలి.
  • కుడి వైపు ఆప్షన్స్‌లో బెనిఫీషియరీ(లబ్దిదారుడు) స్టేటస్‌ ఉంటుంది.
  • ఇప్పుడు ఆధార్‌, అకౌంట్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి Get Dataపై క్లిక్‌ చేయాలి.
  • పీఎం కిసాన్‌కు రిజిస్టర్‌ చేసుకుని.. ఈ-కేవైసీ పూర్తి అయ్యి ఉంటే ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles