PM-KISAN Scheme: అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ కరోనా కష్టకాలంలో పీఎం కిసాన్ పథకం కింద 8వ విడత నగదును విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మోదీ ప్రభుత్వం నేడు మే 14న రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 7 విడతల నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. మే 14న మళ్లీ రెండు వేల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనుంది. దీంతో చాలా మంది రైతులకు కొంతమేర ఆర్దిక ప్రయోజనం కలుగనుంది.(ఇది కూడా చదవండి: పీఎం కీసాన్ డబ్బులు రాకపోతే ఇలా చేయండి?)
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కింద రూ.6 వేలు అందిస్తుంది. అయితే ఈ డబ్బులను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుంది. అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున వస్తాయి. ఇప్పుడు 8వ విడత డబ్బులు రానున్నాయి.
ఇకపోతే మీకు ఈ రూ.2 వేలు మీకు వస్తాయా? రావా? అనే విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు పీఎం కిసాన్ స్కీమ్ పోర్టల్ కు వెళ్లాలి. అక్కడ బెనిఫీషియరీ లిస్ట్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు డబ్బులు వస్తాయా? రావో తెలుసుకోవచ్చు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.