Monday, October 14, 2024
HomeGovernmentAasara Pension Scheme: ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

Aasara Pension Scheme: ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

Aasara Pension Scheme Details in Telugu: ఆసరా అంటే ‘‘సాయం లేదా అండ’’ అనే అర్థం మనకు తెలుసు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కుటుంబంలో సంపాదించే వ్యక్తులు లేని వారి కోసం సాయంగా లేదా అండగా నిలించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది.

(ఇది కూడా చదవండి: సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే ఏమిటి?)

చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ ఎయిడ్స్ ఉన్న వారు కూడా ఈ పథకం కింద సహాయం పొందేందుకు అర్హులు. టీఆర్ఎస్/బీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛను పథకాన్ని తీసుకొచ్చింది. నవంబర్ 8, 2014లో తొలుత రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చింది.

ఆసరా పెన్షన్ స్కీమ్‌కి అర్హులు ఎవరు..?

  • ఆసరా పెన్షన్ పథకంలో భాగంగా 57 ఏళ్లు నిండిన వృద్దులతో పాటు చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ ఎయిడ్స్ గల వారికి రూ.2016, వికలాంగులకు రూ.3,016 పెన్షన్ ఇస్తోంది.
  • ఓటర్ కార్డు లేదా ఆధార్ కార్డుపై సూచించే పుట్టిన తేదీ వివరాల ఆధారంగా పెన్షన్ దారుల వయసును నిర్ధారిస్తారు.
  • దరఖాస్తు దారుల పేరుపై మెట్టభూమి 7.5 ఎకరాలు, మాగాణి 3 ఎకరాలకు మించి ఉండరాదు.
  • కుటుంబ వార్షికాదాయం గ్రామాల్లో రూ.1.5 లక్షలు, నగరాల్లో రూ.2 లక్షలు మించి ఉండకూడదు.
  • డాక్టర్లు, కాంట్రాక్టర్లు, అధిక ఆదాయం కలిగిన ఇతరులు ఈ పెన్షన్ పొందడానికి అనర్హులు.
  • రిటైర్‌మెంట్ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, స్వాతంత్య్ర సమర యోధుల పెన్షన్ పొందుతున్న వారు కూడా ఈ పెన్షన్ పొందడానికి అనర్హులు.
  • 57 ఏళ్లు నిండి, ప్రభుత్వం సూచించిన అన్ని అర్హతలు గల వృద్దులు ఈ పథకం కింద పెన్షన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దివ్యాంగులకు ఆసరా కింద పెన్షన్ పొందేందుకు ఎలాంటి వయసు ప్రమాణాలు లేవు.
  • అలాగే, వితంతువులు వయసు కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి అనే విషయం గుర్తుంచుకోవాలి.
  • చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసు కలిగి ఉండాలి.

ఆసరా పెన్షన్ దరఖాస్తు కోసం కావాల్సిన డాక్యుమెంట్లు..

  • ఒక ఫోటోగ్రాఫ్, మొబైల్ నెంబర్
  • రెసిడెన్స్ ప్రూఫ్
  • ఆధార్ నెంబర్
  • సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ నెంబర్, బ్యాంకు బ్రాంచ్ లేదా స్థానిక పోస్టాఫీసుకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్
  • వయసు ధ్రువీకరణ పత్రం
  • వితంతువులు అయితే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
  • చేనేత కోఆపరేటివ్ సొసైటీకి చెందిన రుజువును చేనేత కార్మికులు సమర్పించాలి.
  • 40 శాతం లేదా అంగ వైకల్యంతో ఉన్న వ్యక్తులు, 51 శాతం వినికిడి లోపం ఉన్న వారు SADAREM సర్టిఫికేట్ సమర్పించాలి.

ఆసరా పెన్షన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు..?

  • మొదట ఆసరా పింఛను ఫోరంలో అవసరమైన సమాచారమంతా నింపాలి.
  • ఆ అప్లికేషన్ ఫామ్‌తో పాటు పైన పేర్కొన్న అన్ని డాక్యుమెంట్లను అటాచ్ చేయాలి.
  • ఈ అప్లికేషన్ ఫామ్‌ను బిల్లు కలెక్టర్ ఆఫీసులో ఇవ్వాలి.
  • గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ అధికారి దరఖాస్తులను స్వీకరిస్తారు.

మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ, జోనల్ అధికారి మీ దరఖాస్తులను పరిశీలించిన తర్వాత ఆసరా పింఛను మంజూరు చేస్తారు. లబ్దిదారులను గుర్తించే క్రమంలో గృహ సర్వే సమాచారాన్ని, జనాభా లెక్కలను, వికలాంగులను, వింతంతువులను, వృద్ధులను, కమ్యూనిటీలకు చెందిన వివిధ వర్గాలను పరిగణనలోకి తీసుకుంటారు.

దరఖాస్తు పరిశీలనలో లేదా ఆకస్మిక తనిఖీలలో ఏదైనా తప్పుడు సమాచారం ఉంటే.. అటువంటి వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో పాటు చెల్లించిన మొత్తాన్ని రికవరీ చేస్తారు.

- Advertisement -

ఆసరా పెన్షన్‌ హెల్ప్ లైన్:

ఆసరా పెన్షన్ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మెయిల్ అడ్రస్‌ను, టోల్‌ఫ్రీ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది. టోల్ ఫ్రీ నంబరు : 1800-200-1001, ఈ-మెయిల్ : aasarapensions@gmail.comగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles