Friday, December 6, 2024
HomeGovernmentRythu Bandhu Scheme: రైతు బంధు పథకానికి ఎవరు అర్హులు.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

Rythu Bandhu Scheme: రైతు బంధు పథకానికి ఎవరు అర్హులు.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

Rythu Bandhu Scheme Details in Telugu: గత కొన్ని ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్నా రుణ సమస్యల నుంచి ఆదుకునేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం తీసుకొని వచ్చింది. 2018 ఫిబ్రవరి 12న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రైతు సమన్వయ సమితి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని ప్రకటించారు.

(ఇది కూడా చదవండి: ధరణిలో ఖాతా విలీనం కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు 2018-19 ఖరీఫ్ సీజన్ నుంచి ప్రతి రైతు పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు ‘వ్యవసాయ పెట్టుబడి మద్దతు రైతు బంధు పథకం’ పేరుతో కొత్త పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ప్రతి ఏడాది వ్యవసాయ, ఉద్యాన పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకం కింద ప్రతి రైతు ఖాతాలో ఎకరాకు రూ.5,000/ జమ చేస్తుంది.

రైతు బంధు పథకం ముఖ్య వివరాలు:

  • తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద రైతులందరికీ ప్రతి ఏడాది ఎకరాకు రూ.10,000 వేలు (పంట సీజన్కు రూ.5,000వేలు) జమ చేస్తుంది.
  • ఈ పథకం వల్ల రాష్ట్రంలోని లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.

రైతు బంధు పథకం కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలా..?

  • రైతులు రైతు బంధు పథకం కోసం ధరఖాస్తు చేసుకోవడానికి ముందుగా మీరు తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న కొత్త పట్టాదార్ పాస్ పుస్తకంతో పాటు బ్యాంకు అకౌంటు కలిగి ఉండాలి.
  • కొత్త పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్, బ్యాంకు అకౌంటు పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్ తీసుకొని మీ మండలంలోని వ్యవసాయ అగ్రికల్చర్ కార్యాలయానికి వెళ్ళాలి.
  • అక్కడ ఉన్న వ్యవసాయ అధికారులకు పైనా పేర్కొన్న దృవ పత్రాలు సమర్పించిన తర్వాత నుంచి మీకు రైతు బంధు సహాయం అందుతుంది.

మీ మండలంలోని వ్యవసాయ అధికారుల నెంబర్ కోసం కింద పేర్కొన్న లింకు క్లిక్ చేయండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles