Pradhan Mantri Awas Yojana-Gramin Scheme Full Details in Telugu: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్(పీఎంఎవై-జీ) అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. 1, ఏప్రిల్, 2015న ప్రారంభించింది. ఈ పథకం కింద ఇళ్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఈ పథకంలో అమలులో భాగంగా ఇప్పటి వరకు 40 లక్షల కాంక్రీట్ ఇళ్లను నిర్మించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?
దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, సొంత ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల స్వంత ఇంటి కలను సాకారం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం అమలులో భాగంగా వారికి స్వంత ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఇందుకోసం కొన్ని అర్హతలను నిర్ణయించారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన దరఖాస్తు కోసం కావాల్సిన అర్హతలు:
- దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశంలో నివసించాలి.
- దరఖాస్తుదారుకు శాశ్వత ఇల్లు ఉండకూడదు.
- దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాల వయస్సు నిండాలి.
- దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితాలో ఉండాలి.
- దరఖాస్తుదారు ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉండటం తప్పనిసరి.
- దరఖాస్తుదారుడు ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.
- ఇప్పటి వరకు ఇల్లు లేని కుటుంబం అయివుండాలి.
- అలాగే రెండు గదులు, కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు దరఖాస్తు చేసుకోవచ్చు.
- 25 ఏళ్లు పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబం.
- భూమిలేని కుటుంబాలు, సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్నవారు.
- షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు, మైనారిటీలు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు:
- మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ఈ కింది పేర్కొన్న పత్రాలను కలిగి ఉండాలి.
- ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నంబర్
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
- జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నంబర్
- బ్యాంకు పాస్ బుక్
- స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) నమోదు సంఖ్య
- మొబైల్ నంబర్
PMAYG కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోతే మీరు ఏదైనా ప్రజా సేవా కేంద్రానికీ లేదా మీసేవా కేంద్రానికీ లేదా CSC కేంద్రానికి వెళ్లి పైన ఇచ్చిన అన్ని పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు.
PMAYG కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ముందుగా మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్ (https://pmayg.nic.in/netiayHome/home.aspx)ను సందర్శించాలి.
- ఆ తర్వాత వెబ్‌సైట్ ప్రధాన పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది.
- ఇప్పుడు మీరు “Awaassoft”పై క్లిక్ చేయాలి, ఆ తర్వాత మరొక జాబితా ఓపెన్ అవుతుంది. అందులో మీరు “డేటా ఎంట్రీ”పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత, ఒక పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు “DATA ENTRY FOR AWAAS”ను ఎంచుకోవాలి.
- ఇప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకుని, “కొనసాగించు” బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా (captcha)ను నమోదు చేసి, “లాగిన్” బటన్‌పై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత “బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం” ఓపెన్ అవుతుంది.
- అందులో మీరు మొదటి విభాగంలో మీ “వ్యక్తిగత వివరాలు” అన్నీ పూరించాలి.
- ఆ తర్వాత రెండవ విభాగంలో “బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు” పూరించాలి.
- మూడవ విభాగంలో మీరు జాబ్ కార్డ్ నంబర్, స్వచ్ఛ్ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్(SBM నంబర్) వంటి “బెనిఫిషియరీ కన్వర్జెన్స్ వివరాల”ను నమోదు చేయాలి.
- ఇక 4వ విభాగంలో, మీరు “కన్సర్న్ ఆఫీస్ ద్వారా పూరించిన వివరాలు”కి సంబంధించిన సమాచారాన్ని నింపాలి.
- ఈ విధంగా మీరు బ్లాక్ లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఆ తర్వాత లబ్దిదారుల జాబితాను rhreporting.nic.in పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు.