Sunday, October 13, 2024
HomeGovernmentSchemesPM Kisan Beneficiary Status: పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరుందా?

PM Kisan Beneficiary Status: పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరుందా?

PM Kisan Beneficiary Status in Telugu: దేశంలో వ్యవసాయం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కేంద్రం ఆర్ధికసాయంగా అర్హులైన ప్రతి రైతుకి ఏడాదికి రూ. 6 వేలను అందిస్తుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిది యోజన పథకం కింద ప్రతి 4 నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తుంది.

ఇప్పటివరకు 14 విడతలలో నగదును కేంద్రం రైతులకు బదిలీ చేసింది. ప్రతి ఏటా ఏప్రిల్- జులై, ఆగస్ట్- నవంబర్, డిసెంబర్- మార్చి కాలంలో రైతులకు ఈ పంట సాయం అందుతుంది. అయితే ఇక్కడే రైతులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ డబ్బులు పొందాలంటే.. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి.

పీఎం కిసాన్ ఈ-కేవైసీ(PM KISAN e-KYC):

  • దీని కోసం రైతులు ముందుగా ఈ పథకం అఫీషియల్ పోర్టల్ https://pmkisan.gov.in/లోకి వెళ్లాలి.
  • అక్కడే హోం పేజీలో ఈ-కేవైసీపై క్లిక్ చేసి.. ఆధార్ కార్డ్ నంబర్ నమోదు చేసి సర్చ్ చేయాలి.
  • ఆ తర్వాత ఆధార్ నంబర్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
  • ఇప్పుడు Get Mobile OTP పై క్లిక్ చేసి.. మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ నమోదు చేసి సబ్మిట్ చేస్తే.. ఈ-కేవైసీ సబ్మిట్ అయినట్లే.

పీఎం కిసాన్ బెనిఫిషియరీ లిస్ట్‌లో మీ పేరుందా?

  • పీఎం కిసాన్ బెనిఫిషియరీ ఖాతాలో మీ పేరు ఉంటే మాత్రమే మీకు డబ్బులు వస్తాయి.
  • పీఎం కిసాన్ లిస్ట్‌లో మీ పేరుందో లేదో తెలుసుకునేందుకు https://pmkisan.gov.in/ పోర్టల్‌లో బెనిఫిషియరీ లిస్ట్ అని ఉంటుంది. దాంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.

(ఇది కూడా చదవండి: Update Aadhar Card: ఆధార్‌ వివరాలను ఫ్రీగా అప్‌డేట్ చేసుకోండి ఇలా..?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles