Tuesday, January 28, 2025
HomeGovernmentSchemesIndiramma Indlu Scheme: స్వంత స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు..!

Indiramma Indlu Scheme: స్వంత స్థలం ఉన్న వారికే ఇందిరమ్మ ఇల్లు..!

Telangana Indiramma Indlu Housing Scheme Details in Telugu: మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా! అయితే మీకు అదిరిపోయే శుభవార్త. పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ఈ నెల 11న లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భద్రాచలం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టె అవకాశం ఉంది.

ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అమలుకు సంబంధించిన కీలక అంశాలపై గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. తొలి దశలో.. సొంత స్థలం, రేషన్‌ కార్డు ఉన్న వారికే ఈ పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలం అందించి, ఆర్థిక సాయం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

రాబోయే ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,500 ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇంటి నిర్మాణం కోసం లబ్ధిదారుకు రూ.5 లక్షలు అందించనున్నారు. ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

(ఇది కూడా చదవండి: పీఎం సూర్య ఘర్‌ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?)

త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసి, ఆ మేరకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది డిసెంబరు 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా.. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, గృహ జ్యోతి, రైతు భరోసా, చేయూత పథకాలకు దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే.

ఇందులో ఇందిరమ్మ ఇళ్ల 30-40 లక్షల మంది నుంచి దరఖాస్తులు వచ్చాయి. పథకం కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు రేషన్‌ కార్డు నంబర్లు వేయలేదు. దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయని సర్కారు భావిస్తుంది. అవసరమైతే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి మరోసారి ఆయా దరఖాస్తులను పరిశీలించనున్నారు.

- Advertisement -

అర్హతలు ఎలా నిర్ణయిస్తారు..!

ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా..? అనర్హులా..? అనే అంశాన్ని ప్రభుత్వం మరోసారి క్షుణ్ణంగా పరిశలించనుంది. మార్గదర్శకాల విడుదల అనంతరం ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనుంది. దరఖాస్తుదారులు అర్హులు అయి, ఇంటి స్థలం ఉన్న వారైతే.. ఆ స్థలం సొంతమేనా..? డీ- ఫాం పట్టానా..? లేదా పూర్వీకుల నుంచి వచ్చిందా..? అనే వివరాలను సేకరించనున్నారు.

ఇంటి స్థలం లేని వారు.. స్థలం ఇవ్వాలని కోరేలా పరిశీలనా పత్రంలో ఎంపికను పెట్టారు. సిమెంటు రేకుల షెడ్డు ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే వారిని అనర్హులుగా పరిగణించనున్నారు. కాగా, ఈ మొత్తం ప్రక్రియ కోసం గ్రామస్థాయి సిబ్బందిని వినియోగించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

(ఇది కూడా చదవండి: పీఎం సూర్య ఘర్‌ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles