Friday, May 3, 2024
HomeGovernmentSchemesPM Surya Ghar Yojana: పీఎం సూర్య ఘర్‌ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

PM Surya Ghar Yojana: పీఎం సూర్య ఘర్‌ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

PM Surya Ghar Yojana Muft Bijli Yojana Step by Step Guide in Telugu: ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి ఆమోదం తెలిపింది. ఈ సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్ పథకం కింద 1 కోటి ఇళ్లపై సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ శక్తిని ఆదా చేసుకోవచ్చు.

(ఇది కూడా చదవండి: ఓటర్ ID కార్డ్‌ పోతే డూప్లికేట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోండి ఇలా..?)

ఆసక్తి గల కుటుంబాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి భారీగా ప్రచారాన్ని చేసింది. ఈ పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు ప్రజలు తమ పేరును https://pmsuryaghar.gov.inలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రధానమంత్రి-సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం సబ్సిడీ మొత్తం ఎంత?

ప్రస్తుత సమాచారం ప్రకారం 1 kW సోలార్ యూనిట్‌కు రూ. 30,000 సబ్సిడీ, 1 kW సోలార్ యూనిట్‌కు రూ. 60,000, 3 kW లేదా అంతకంటే ఎక్కువ గల సోలార్ యూనిట్‌లకు రూ. 78,000 సబ్సిడీ లభించనుంది.

నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి..?

గృహ వినియోగదారులు నేషనల్ పోర్టల్ https://pmsuryaghar.gov.in ద్వారా సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు పోర్టల్ పేర్కొన్న విక్రేతను ఎంచుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

ప్రధానమంత్రి-సూర్య ఘర్ పథకానికి రుణ లభ్యత:

గృహా వినియోగదారులు తమ ఇంటిపై 3 kW వరకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి దాదాపు 7 శాతం వడ్డీతో మీకు బ్యాంకుల నుంచి రుణం కూడా లభిస్తుంది.

పీఎం సూర్య ఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • మొదట పోర్టల్‌లో ఓపెన్ చేసి Apply for Rooftop Solar అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
  • దీనికోసం మీ రాష్ట్రం, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీ ఎంచుకొని మీ విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత పోర్టల్‌లో ఉన్న నియమ నిబంధలను అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి.
  • ఆ తర్వాత కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరు సహాయంతో లాగిన్‌ అవ్వాలి.
  • అక్కడ ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లై చేసుకోవాలి.
  • దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత డిస్కమ్‌ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి.
  • అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల(Empanelled Vendors) నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.
  • ఇన్‌స్టలేషన్‌ పూర్తయిన తర్వాత, ఆ ప్లాంట్‌ వివరాలను పీఎం సూర్య ఘర్‌ పోర్టల్‌లో సమర్పించి నెట్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  • నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు వచ్చి సోలార్ ప్లాంట్ తనిఖీలు చేస్తారు.
  • అనంతరం పీఎం సూర్య ఘర్ పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు.
  • ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు కమిషనింగ్‌ సర్టిఫికేట్‌, క్యాన్సిల్డ్‌ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్‌ చేయాలి.
  • మీరు అన్నీ వివరాలు సమర్పించిన 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.

పీఎం సూర్య ఘర్ యోజన దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు(Eligibility):

పీఎం సూర్య ఘర్ యోజన 2024 పథకం కింద ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే.. భారతదేశంలో శాశ్వత నివాసితులు అయ్యి ఉండాలి.

పీఎం సూర్య ఘర్ యోజన దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు:

  • నివాస ధృవీకరణ పత్రం
  • ఆధార్ కార్డ్
  • విద్యుత్ బిల్లు
  • రేషన్ కార్డు
  • మొబైల్ నంబర్
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • బ్యాంక్ ఖాతా పాస్‌బుక్
  • ఈ-మెయిల్

3kW సోలార్‌ ప్లాంట్‌ కోసం ఎంత విస్తీర్ణం కావాలి?

1kW సోలార్‌ ప్లాంట్‌ ఇన్‌స్టాల్‌ చేసేందుకు కనీసం 12 గజాల (130 Square Feet) స్థలం కావాలి. ఈ ప్రకారం చూస్తే 3kW సోలార్‌ ప్లాంట్‌ కోసం 35 గజాల స్థలం అవసరం పడుతుంది.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles