Tuesday, December 3, 2024
HomeGovernmentSchemesGruha Jyothi Scheme: తెలంగాణలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ ప్రారంభం.. వారు మాత్రమే...

Gruha Jyothi Scheme: తెలంగాణలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ స్కీమ్ ప్రారంభం.. వారు మాత్రమే అర్హులు!

Telangana Free Electricity Gruha Jyothi Scheme Eligibility Details in Telugu: తెలంగాణ ప్రభుత్వం పెద ప్రజలకు శుభవార్త తెలిపింది. ఫిబ్రవరి 27న సచివాలయంలో మహాలక్ష్మి, గృహ జ్యోతి పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించారు. గృహ జ్యోతి పథకం అమలులో భాగంగా ఇకనుంచి అర్హులకు నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు అందించనున్నట్లు పేర్కొన్నారు.

విద్యుత్ పంపిణీ సంస్థల ద్వారా గృహ జ్యోతి పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న తెల్లరేషన్ కార్డుదారులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మీటర్ రీడింగ్’కు వెళ్లినప్పుడు దరఖాస్తుదారుల ఆధార్, తెల్లరేషన్ కార్డులను విద్యుత్ సిబ్బంది పరిశీలించనున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు మార్చిలో జీరో విద్యుత్ బిల్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది.

గృహ జ్యోతి పథకం అర్హతలు, మార్గదర్శకాలు:

  • ప్రజాపాలన కార్యక్రమంలో గృహ జ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది.
  • దరఖాస్తుదారులకు ఆధార్‌ అనుసంధానించిన తెల్ల రేషన్‌ కార్డు ఉండాలి. సంబంధిత గృహ విద్యుత్తు కనెక్షన్‌ నెంబర్‌ ఉండాలి.
  • అద్దెకున్న కుటుంబాలు కూడా ఈ పథకానికి అర్హులు.
  • ఈ పథకం ద్వారా గృహ విద్యుత్తు కనెక్షన్‌పై నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సదుపాయం అమలవుతుంది.
  • 200 యూనిట్ల వరకు విద్యుత్‌ వినియోగించే అర్హత కలిగిన కుటుంబాలన్ని ఆ నెలలో జీరో బిల్లును అందుకుంటాయి.
  • ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రంలో 39.9 లక్షల కుటుంబాలు లబ్ది పొందుతాయి.
  • ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డుతో పాటు గృహ విద్యుత్తు కనెక్షన్‌ నెంబర్‌తో పూర్తి వివరాలు సమర్పించిన కుటుంబాలన్నీ ఈ ప్రయోజనాన్ని అందుకుంటాయి.
  • 2024 మార్చి నుంచి లబ్ధిదారులకు జీరో బిల్లులు జారీ చేస్తారు.

అర్హతలుండీ జీరో బిల్లు రాని కుటుంబాలు అనుసరించాల్సిన పద్ధతులు:

  • అర్హతలున్నప్పటికీ జీరో బిల్లు పొందని గృహ వినియోగదారులు తిరిగి దరఖాస్తు చేసుకునే సదుపాయముంది.
  • మండల ఆఫీసు లేదా మునిసిపల్‌ కార్యాలయాల్లో గృహ జ్యోతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెల్లరేషన్‌ కార్డు, లింక్‌ చేయబడిన ఆధార్‌, గృహ విద్యుత్తు కనెక్షన్‌ నెంబర్లను సమర్పించాలి.
  • అర్హులని గుర్తించినట్లయితే, వారు సవరించిన బిల్లును జారీ చేస్తారు. ఈ పథకానికి అర్హుల జాబితాలో నమోదు చేస్తారు.
  • అర్హతలున్న వినియోగదారులు దరఖాస్తులను ధ్రువీకరించుకునే అవకాశం కల్పించినందున, వారి నుంచి బిల్లు రికవరీ చేయడానికి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరు.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles