Friday, May 3, 2024
HomeGovernmentSchemesRs 500 LPG Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం.. వీరు మాత్రమే అర్హులు!

Rs 500 LPG Cylinder: రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం.. వీరు మాత్రమే అర్హులు!

Telangana Rs 500 LPG Cylinder Eligibility Details in Telugu: తెలంగాణ ప్రభుత్వం పెద ప్రజలకు తీపికబురు అందించింది. రాష్ట్రంలో అర్హులైన వారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు అడుగు పడింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్దం అయ్యారు.

సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం అమలు కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 27న జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో అర్హుల కుటుంబాల సంఖ్య దాదాపు 90 లక్షలు ఉంటుంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బులను గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. మూడేళ్ల సరాసరి వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇస్తారు. ఈ Rs 500 LPG Cylinder అమలు నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

మహాలక్ష్మి సబ్సిడీ రూ.500 LPG గ్యాస్ సిలిండర్ పథకం అర్హతలు, మార్గదర్శకాలు:

  • తెలంగాణ ప్రభుత్వం కేవలం 500 రూపాయలకే ఎల్పిజి సిలిండర్‌ను అందించేందుకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది.
  • మహిళా సాధికారతతో పాటు వాళ్లపై ఉన్న ఆర్థిక భారంలో పాలుపంచుకోవటం, కట్టెల పొయ్యిల కాలుష్యం నుంచి మహిళలకు విముక్తి కల్పించాలనేది ప్రధాన లక్ష్యం.
  • కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రేషన్‌ కార్డు (ఆహార భద్రత కార్డులు) ఉండి, ప్రస్తుతం LPG గ్యాస్‌ గృహ వినియోగదారులందరూ ఈ పథకానికి అర్హులు.
  • ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసిన కుటుంబాలకు మహాలక్ష్మి పథకం ప్రయోజనాలు వర్తిస్తాయి.
  • గడిచిన మూడు సంవత్సరాల్లో ఆ కుటుంబం వినియోగించిన LPG సిలిండర్ల సగటు ప్రతిపాదికగా సబ్బిడీ సిలిండర్లకు పరిమితి ఉంటుంది.
  • ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులున్నారు. దీంతో దాదాపు 40 లక్షల మంది మహిళలు మహాలక్ష్మి పథకంలో ప్రయోజనాన్ని
  • అందుకుంటారు.
  • లబ్ధిదారులు గ్యాస్‌ సిలిండర్‌ పొందేటప్పుడు పూర్తి ధరను (రిటైల్‌ ధర) చెల్లించాలి. లబ్ధిదారులు రూ.500కు అదనంగా చెల్లించిన డబ్బులను గ్యాస్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తిరిగి లబ్ధిదారుల బ్యాంకు
  • ఖాతాకు (డైరెక్ట్‌ బెనిఫిసియర్‌ ట్రాన్స్ఫర్ DBT విధానం ద్వారా) జమ చేస్తాయి.
  • అర్హులైన లబ్ధిదారుల జాబితా, ఏజెన్సీలు పంపిణీ చేసిన సిలిండర్ల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీని ప్రతి నెలా గ్యాస్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు చెల్లిస్తుంది.
  • మహాలక్షి పథకం 2024 ఫిబ్రవరి చివరి నుంచి ప్రారంభమవుతుంది.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles