PM KISAN: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్దిక చేయూత కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతులకు మూడు విడతల్లో రూ.2 వేలు చొప్పున ఏడాదికి రూ.6 వేలు బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పుడు కూడా 8వ విడత నగదును రైతుల ఖాతాలో జమ చేసేందుకు సిద్దం అవుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ మద్య కొంత మంది రైతులు అర్హత లేకున్నా కూడా పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని గుర్తించింది. ఈ సంఖ్య దాదాపు 33 లక్షల మంది అనర్హులుగా ఉన్నారని తేలింది. ఇక వీరికి మోదీ ఇస్తున్న రూ.6,000 ఇక రావు అన్నమాట. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు, అనర్హులు అనే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం.
పీఎం కిసాన్ పథకానికి ఎవరు అర్హులు?
- 5 ఎకరాలలోపు గల చిన్న, ఉపాంత రైతులు
- ప్రతి కచ్చితంగా పొలం పాస్ బుక్ ఉండాలి
- లబ్ధిదారుడు భారతీయ పౌరుడిగా ఉండాలి.
పీఎం కిసాన్ పథకానికి ఎవరు అనర్హులు?
- 5 ఎకరాల పైబడిన వారు ఈ పథకానికి అనర్హులు.
- రాజ్యాంగ పదవిని నిర్వహించిన లేదా నిర్వహిస్తున్న వ్యక్తులు.
- ఏదైనా ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు లేదా అధికారులు.
- స్థానిక ప్రభుత్వ సంస్థల రెగ్యులర్ ఉద్యోగులు.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత మరియు మాజీ మంత్రులు.
- లోక్ సభ, రాజ్యసభ ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.
- రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ప్రస్తుత మరియు మాజీ సభ్యులు.
- జిల్లా పంచాయతీ ప్రస్తుత లేదా మాజీ చైర్‌పర్సన్.
- ఏదైనా మునిసిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మరియు మాజీ మేయర్.
- గత ఏడాది ఆధాయ పన్ను చెల్లించే వ్యక్తులు.
- ప్రతి నెలా రూ .10,000 లేదా అంతకంటే ఎక్కువ పింఛను పొందే వారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.