Birth Certificate Application Process: జనన ధృవీకరణ పత్రం అనేది ఒక వ్యక్తి జననాన్ని రికార్డ్ చేయడానికి, పేరు, స్థలం, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల ద్వారా వారిని గుర్తించడానికి ప్రభుత్వం జారీ చేసిన ముఖ్యమైన డాక్యుమెంట్. జనన , మరణాల నమోదు చట్టం, 1969 ప్రకారం ప్రతి జననాన్ని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేయాలి . ప్రభుత్వం అందించే వివిధ సౌకర్యాలను పొందడానికి పౌరులందరూ జనన ధృవీకరణ పత్రాన్ని పొందవలసి ఉంటుంది.
తెలంగాణలో బర్త్ సర్టిఫికెట్ ఏ శాఖ నమోదు చేస్తోంది.
తెలంగాణలో జనన నమోదు కోసం సంబంధిత అథారిటీెలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ ప్రభుత్వ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ విభాగం బాధ్యత వహిస్తుంది.
బర్త్ సర్టిఫికెట్ వల్ల కలిగే ఉపయోగాలు
- జనన ధృవీకరణ పత్రం ఓటు హక్కును పొందేందుకు రుజువుగా పనిచేస్తుంది
- పాఠశాలల్లో అడ్మిషన్ పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి
- సైనిక సేవలో ప్రవేశించడానికి
- చట్టబద్ధంగా అనుమతించబడిన వయస్సులో వివాహం చేసుకునే హక్కును క్లెయిమ్ చేయడానికి జనన ధృవీకరణ పత్రం అవసరం
- వారసత్వం మరియు ఆస్తి హక్కుల పరిష్కారానికి ఇది తప్పనిసరి
- డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ పొందేందుకు
- ప్రభుత్వం అందించే పెన్షన్, సామాజిక భద్రత లేదా ఆరోగ్య బీమా పొందేందుకు
- బీమా ప్రయోజనాలను పొందేందుకు
బర్త్ సర్టిఫికెట్ ఎప్పుడు అప్లయ్ చేయాలి?
- తెలంగాణలో జనన ధృవీకరణ పత్రాన్ని పుట్టిన తేదీ నుండి 21 రోజులలోపు సంబంధిత స్థానిక అధికారుల వద్ద పుట్టిన తేదీని నమోదు చేయాలి
- ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు లేదా ఆస్పత్రులలో ప్రసవం జరిగితే, అటువంటి వివరాల్ని వెల్లడించాల్సి ఉంటుంది.
- ఇంట్లో ప్రసవం జరిగితే, అది కుటుంబ పెద్దల బాధ్యత, లేదా ఇతర కుటుంబ సభ్యులెవరైనా అలాంటి జననాలను నివేదించాలి.
తెలంగాణలో బర్త్ సర్టిఫికెట్ పొందేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు
- బిడ్డ జన్మించిన ఆసుపత్రి లేదా వైద్య సంస్థ ద్వారా జారీ చేసిన లేఖ
- ధృవీకరణ కోసం తల్లిదండ్రుల గుర్తింపు రుజువు
- తల్లిదండ్రుల జనన ధృవీకరణ పత్రం లేదా SSC మార్కుల మెమో
- తల్లిదండ్రుల వివాహ ధృవీకరణ పత్రం
ఆన్‌లైన్ జనన వివరాలను రికార్డ్‌లలో తనిఖీ చేయండి
జనన ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారుడు తెలంగాణ జనన రికార్డులలో జనన వివరాలు అందుబాటులో ఉన్నాయని ధృవీకరించాలి. తెలంగాణ జనన రికార్డులలో ఆన్‌లైన్‌లో జనన వివరాలను శోధించడానికి క్రింద ఇవ్వబడిన విధానాన్ని అనుసరించండి.
బర్త్ సర్టిఫికెట్ ను ఎక్కడ అప్లయ్ చేయాలి.
- యూనిఫైడ్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (UBDMIS) అధికారిక సైట్‌ను సందర్శించండి .
- సిటిజన్ ఆప్షన్ క్లిక్ చేస్తే సెర్చ్ బర్త్ డీటెయిల్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- కొత్త పేజీలో, డ్రాప్-డౌన్ మెను నుండి రిజిస్ట్రేషన్ యూనిట్‌ని ఎంచుకోండి.
- కింద జనన వివరాలను నమోదు చేయండి. వాటిల్లో
- పుట్టిన నెల, సంవత్సరం
- పిల్లల లింగం
- తండ్రి, తల్లి,బిడ్డ పేరు
- పుట్టిన స్థలం
- పుట్టిన సమయంలో చిరునామా
- శాశ్వత చిరునామా
- హాస్పిటల్ పేరు
- అన్ని తప్పనిసరి వివరాలను అందించిన తర్వాత, సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- జనన రికార్డులలో జనన వివరాలు అందుబాటులో ఉంటే, దరఖాస్తుదారు జనన ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.సంబంధిత వివరాలు లేకపోతే మీరు సమీపంలోని C&DMA లేదా పంచాయతీని సంప్రదించాలి.
తెలంగాణలో జనన ధృవీకరణ పత్రం స్టేటస్’ను ఎలా ట్రాక్ చేయాలి?
తెలంగాణ జనన ధృవీకరణ పత్రం స్థితి గురించి తెలుసుకోవడానికి, తెలంగాణ UBDMIS వెబ్‌సైట్‌కి వెళ్లండి. హోమ్ పేజీ నుండి మీ సేవ ఆప్షన్ పై క్లిక్ చేస్తే స్టేటస్ తెలుస్తోంది.