EWS Certificate: ఆర్థికంగా బలహీనంగా ఉన్న అగ్ర వర్ణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్ కల్పించింది. అయితే, అమలు ప్రక్రియను రాష్ట్రాలకు కేటాయించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్( EWS) సర్టిఫికేట్ కోసం మీసేవా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.
ఈ సర్టిఫికేట్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యలో 10 శాతం రిజర్వేషన్ పొందవచ్చు. అయితే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం ఎలా అప్లయ్ చేసుకోవాలి, కావాల్సిన పత్రాలు ఏమిటి అనే వాటి గురుంచి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణలో EWS సర్టిఫికేట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
తెలంగాణలో EWS సర్టిఫికేట్ మీసేవా పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- మొదట తెలంగాణ మీసేవ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- మీ సేవ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు కావాల్సిన పేరు, పాస్ వర్డ్ వివరాల్ని ఎంటర్ చేయండి.
- ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత, మీరు డాష్‌బోర్డ్‌లో అప్లికేషన్ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేయాలి.
- రెవెన్యూ విభాగం కింద ‘ఎకనామిక్ వీకర్ సెక్షన్’ పై క్లిక్ చేయండి
- దరఖాస్తు ఫారమ్‌లో అన్ని వివరాలను ఎంటర్ చేయండి.
- అన్ని వివరాలను ఎంటర్ చేసిన తర్వాత, ‘షో పేమెంట్ ‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ‘కన్ఫామ్ పేమెంట్’పై క్లిక్ చేయండి
- అనంతరం మీకు డ్యాష్ బోర్డ్ మీద పేమెంట్ డీటెయిల్స్ పేజీ మీద ఓపెన్ అవుతుంది. అందులో మీరు పేమెంట్ ఎలా చెల్లించాలని అనుకుంటున్నారో ఆ పేమెంట్ మెథడ్ ను ఎంపిక చేసుకోండి.
- ఇక్కడ మీరు పేమెంట్ చేసినట్లు ఓ రసీదు వస్తుంది. దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. భవిష్యత్ లో దీని అవసరం చాలా ఉంటుంది.
తెలంగాణలో EWS సర్టిఫికేట్ కోసం కావాల్సిన అర్హతలు
- దరఖాస్తుదారుడు సాధారణ వర్గానికి చెందినవారై ఉండాలి
- దరఖాస్తుదారుడి కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షల లోపు ఉండాలి.
- 5 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు
- దరఖాస్తుదారుడు లేదా వారి కుటుంబ నివాస ఆస్తి విస్తీర్ణంలో 100 చ.అడుగులకు మించకూడదు
- దరఖాస్తుదారుడికి నోటిఫైడ్ మునిసిపాలిటీ సెక్టార్‌లో 100 చదరపు గజాలు మించిన నివాస ప్లాట్‌ను కలిగి ఉండకూడదు
EWS సర్టిఫికేట్ దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
- ఆదాయ ధృవీకరణ పత్రం
- కుల ధృవీకరణ పత్రం
- ఆధార్ కార్డు
- పాన్ కార్డ్
- ఇన్కమ్ టాక్స్ స్టేట్ మెంట్
- ఇప్పటికే ఉన్న భూమి లేదా ఆస్తికి సంబంధించిన రుజువు
- నివాస ధృవీకరణ పత్రం
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
తెలంగాణలో EWS సర్టిఫికేట్ స్టేటస్ ను ఎలా పరిశీలించాలి?
- తెలంగాణ మీసేవా అధికారిక పోర్టల్‌ని సందర్శించండి
- హోమ్ పేజీలో, ‘నో యువర్ అప్లికేషన్ స్టేటస్’ ట్యాబ్ కింద మీ అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే సంబంధిత వివరాలు మీకు అక్కడ కనిపిస్తాయి.