Apply for New Ration Card in Telangana: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం, పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కమిటీ త్వరలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ఈ మార్గదర్శకాలు భూమి, ఇన్ కమ్ ఆధారంగా అర్హత ప్రమాణాలను నిర్ధేశించనున్నట్లు సమాచారం. తద్వారా అర్హులైన వారికి ప్రయోజనం కల్పించేందుకు ప్రభుత్వ ముఖ్యఉద్దేశ్యమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
సబ్సిడీ బియ్యం దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన బియ్యాన్ని అందించనుంది. ముతక రకం వరిలో దాదాపు 50 శాతం పక్కదారి పట్టి దుర్వినియోగం అవుతున్నాయని ఉత్తమ్ తెలిపారు. ప్రభుత్వం అందుబాటులోకి తేనున్న కొత్త మార్గదర్శకాలు లబ్ధి దారులకు చేయూనందిస్తూ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది కుటుంబాలకు ఆహార భద్రత, సబ్సిడీ వస్తువులను పొందడంలో రేషన్ కార్డులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ కార్డులు పేదరికాన్ని నిర్మూలించడం, జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
రేషన్ కార్డ్ పొందేందుకు కావాల్సిన అర్హతలు:
వనరులను సమర్ధవంతంగా కేటాయించేలా చూసేందుకు, కొత్త రేషన్ కార్డులు పొందేందుకు ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలను ఏర్పాటు చేసింది. వీటి ఆధారంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇళ్లు, కార్లు లేదా ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు పథకం నుంచి మినహాయించనున్నారు. అదనంగా, ప్రభుత్వ ఉద్యోగులు కొత్త రేషన్ కార్డులకు అర్హులు కాదు.
రేషన్ కార్డ్ పొందేందుకు కావాల్సిన అర్హతలు:
- భారతదేశ పౌరసత్వం.
- తెలంగాణలో నివాసం.
- మరే రాష్ట్రంలోనైనా కుటుంబ కార్డు లేకపోవడం.
- ఆదాయపు పన్ను చెల్లించకూడదు
- స్వంత కారు ఉండకూడదు.
రేషన్ కార్డును దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు:
- అవసరమైన పత్రాలు
- నివాస రుజువు (ఉదా, ఆధార్ కార్డ్).
- వయస్సు ధృవీకరణ.
- ఐడెంటిటీ కార్డ్
- కుటుంబ ఆదాయ రుజువు.
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
తెలంగాణలో రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- తెలంగాణలో రేషన్ కార్డ్ అప్లయ్ చేసుకోవాలంటే ముందుగా మీరు మీ సేవా కేంద్రాన్ని సందర్శించాలి
- మీ సేవ అధికారిక వెబ్ సైట్ https://www.tg.meeseva.gov.inలో సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్ ఆప్షన్ క్లిక్ చేయండి.
- అందులో మీకు అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే రేషన్ కార్డ్ అప్లయ్ చేసే ధరఖాస్తు ఫారమ్ కనిపిస్తుంది.
- ఆ ఫారమ్ ను ప్రింటౌట్ తీసుకుని అందులో అడిగిన వివరాల్ని అందించాల్సి ఉంటుంది. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి.
అనంతరం పైన పేర్కొన్న కావాల్సిన డాక్యుమెంట్లను ఈ రేషన్ కార్డ్ అప్లికేషన్ కు జత చేసి మీ సేవలో అందించాలి. అనంతరం మీరు రేషన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకున్నారని తెలిపేలా మీకు ఒక రసీదు ఇస్తారు. దానిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. భవిష్యత్ లో దాని అవసరం ఉంటుంది.