దేశంలో ఓటర్ ఐడీ కార్డు ఉన్న ప్రాముఖ్యత గురుంచి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక అవినీతి పరుడిని అధికారం నుంచి తొలగించాలి అన్న, ఒక మంచి వాడికి పట్టం కట్టాలి అన్న సామాన్యుడు చేతిలో ఉన్న ఒకే ఒక బ్రహ్మాస్త్రం ఓటు.
అలాంటి ఓటు వేసేందుకు దేశంలోని 18 ఏళ్లు నిండిని ప్రతి ఒక్కరూ అర్హులు. అయితే, ఓటు వేసేందుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటరు ఐడీ కోసం తప్పక కలిగి ఉండాల్సిందే. కేంద్ర ఎన్నికలు కమిషన్ ఈ నెల(నవంబర్) 30 వరకు కొత్త ధరఖాస్తూ దారుల నుంచి ధరఖాస్తులను స్వీకరిస్తుంది.
(చదవండి: రూ.లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు లాభం.. కళ్లుచెదిరే రాబడి!)
గత ఏడాది అప్లై చేసుకున్నాక కూడా వారి అప్లికేషన్ రద్దు అయిన కూడా ఇప్పుడు మరోసారి అప్లై చేసుకోవచ్చు. కొత్త ఓటరు కార్డు ధరఖాస్తు చేసుకోవడం కోసం ఎవ్వరి వద్దకు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఓటర్ కార్డు పొందాలని భావిస్తే.. మీ వద్ద ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఈ రెండు డాక్యుమెంట్లు ఉంటే ఓటర్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు.
కొత్త ఓటర్ ఐడీ కార్డు దరఖాస్తు విధానం:
- మీరు ముందుగా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌కు https://nvsp.in/ వెళ్లాలి.
- ఆ తర్వాత వెబ్‌సైట్‌లో కొంచెం కిందకు వస్తే ఎడమ చేతి వైపున రిజిస్టర్ నౌ టు ఓట్ అని ఆప్షన్ కనిపిస్తుంది.
- ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీరు రిజిస్టర్ చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి.
- లాగిన్ అయిన తర్వాత Forms అనే ఆప్షన్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు Form 6 అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి నచ్చిన భాషను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీరు ఉంటున్న రాష్ట్రం, జిల్లా, నియోజక వర్గం ఎంచుకోవాలి.
- ఇప్పుడు మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగం వివరాలు నమోదు చేయాలి.
- ఆ తర్వాత శాశ్వత చిరునామా వివరాలు, మీ ఇంట్లో ఉన్న వారి ఓటరు కార్డు నెంబర్, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ నమోదు చేయాలి.
- ఇక ఆ తర్వాత మీ ఫోటో ప్రూఫ్, వయస్సుకి సంబంధించిన ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అప్ లోడ్ చేయాలి.
- ఆ తర్వాత మిగతా వివరాలు చేసి నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి.
- మీ ధరఖాస్తును అధికారులు వేరిఫై చేసిన తర్వాత ఆమోదం/రిజెక్ట్ చేస్తారు.
- అప్పుడు మీ ఈమెయిల్‌కు రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీని సాయంతో మీ కార్డు స్టేటస్ తెలుసుకోవచ్చు. కార్డు నెల రోజుల్లోగా మీ ఇంటికి వస్తుంది.