Book Train Ticket 5 Minutes Before: మనం ఏదైనా ఎక్కువ దూరం వెళ్లేటప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైలులో వెళ్ళడానికి ఇష్టపడుతాం. అయితే, చాలా దూరం వెళ్ళడానికి ఎక్కువ శాతం మంది ప్రయాణికులు కొన్ని నెలల ముందే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, అనుకోకుండా ఒక రోజు ముందు మన ప్రయాణం ఖరారైతే.. తత్కాల్ బుకింగ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటాం.
అలాకాకుండా మన ప్రయాణం కొన్ని గంటల ముందు నిర్ణయమైతే? అలాంటి సమయంలో కూడా రైలు టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం..?
(ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోండిలా..?)
మనం ప్రయాణించే రైలు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్ కాన్సెల్ చేసుకునే సందర్భంలో.. ఆ ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్ టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ రెండు ఛార్ట్‌లను ప్రిపేర్ చేస్తుంది.
మొదటి ఛార్ట్ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్ చేస్తే.. రెండో ఛార్ట్ అనేది రైలు స్టార్ట్ అవ్వడానికి ముందు రూపొందిస్తారు. గతంలో 30 నిమిషాల ముందు వరకు మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతించేవారు. కానీ, ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పించారు.
5 నిమిషాల ముందూ రైలు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి..?
- చివరి నిమిషంలో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోసుకోవడం కోసం ముందుగా ఆ రైలులో సీట్లు ఖాళీ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి.
- ఈ విషయం రైల్వే శాఖ ప్రిపేర్ చేసే ఆన్‌లైన్ ఛార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
- దీనికోసం https://www.irctc.co.in/online-charts/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు .
- అక్కడ ట్రైన్ పేరు/నంబర్, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఎంటర్ చేసి GET TRAIN CHARTపై క్లిక్ చేయాలి.
- వెంటనే తరగతుల వారీగా (ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఛైర్ కార్, స్లీపర్) అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి.
- ఒకవేళ సీటు ఖాళీగా ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు ఖాళీగా లేకపోతే సున్నా చూపిస్తుంది.
- కోచ్ నంబర్, బెర్త్… మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.