How To Apply Atal Pension Yojana: మీకు రేషన్ కార్డు ఉందా.? అయితే మీకు ప్రతీ నెలా రూ. 5 వేలు పొందొచ్చు అనే విషయం మీకు తెలుసా. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. కేంద్ర ప్రభుత్వం 2015 – 16లో అటల్ పెన్షన్ యోజన(Atal Pension Yojana) పేరుతో పథకం తీసుకొని వచ్చింది. అసంఘటిత కార్మికులను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రవేశ పెట్టింది.
ఈ పధకంలో పెట్టుబడి పెట్టిన వారికి 60 సంవత్సరాల దాటిన తర్వాత వెయ్యి నుంచి రూ. 5 వేల వరకు పెన్షన్ లభిస్తుంది. ఏ భారతీయ పౌరుడైనా ఈ పథకం ప్రయోజనాలు పొందొచ్చు. దీనికి మీరు నామమాత్రపు ప్రీమియం చెల్లిస్తే చాలు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు అయితే.. గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు. ఇక ఈ Atal Pension Yojana పథకంలో చేరాలంటే.. మీకు జన్‌ధన్ యోజన కింద బ్యాంకులో లేదా పోస్టాఫీస్‌లో ఒక ఖాతా ఉండాలి. 60 ఏళ్ల తర్వాత మీకు ప్రతి నెలా కచ్చితంగా పెన్షన్ లభిస్తుంది.
(ఇది కూడా చదవండి: EPF/EPS ఖాతాలో ఉన్న మొత్తం నగదు ఎలా విత్ డ్రా చేయాలి?)
ఉదాహరణకు ఓ వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరితే.. 60 ఏళ్ల తర్వాత నెల నెలా రూ. 5 వేలు పొందటానికి.. ప్రతీ నెలా రూ. 210 ప్రీమియం చెల్లించాలి. అలాగే నెలకు రూ. 1000 పెన్షన్ పొందటానికి మీరు నెలకు రూ. 42 పెట్టుబడి పెడితే చాలు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇందులో ప్రయోజనాలు పొందవచ్చు. భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే.. 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెలా రూ.10 వేలు పించన్ పొందొచ్చు.
అటల్ పెన్షన్ యోజన పథకం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
అటల్ పెన్షన్ యోజన పథకం కోసం మీరు సేవింగ్ బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న సమీప బ్యాంక్ బ్రాంచ్ లేదా పోస్ట్ ఆఫీస్‌ను సందర్శించాలి. ఆ తర్వాత APY ఖాతాను తెరవడానికి APY రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను నింపి బ్యాంకు మేనేజర్’కు సమర్పించాలి.