Friday, March 29, 2024
HomeGovernmentమీ దగ్గర ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్

మీ దగ్గర ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉంటే? రూ.1,00,000 వరకు బెనిఫిట్

మీ దగ్గర ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉందా? అయితే, మీకు ఒక శుభవార్త. డెబిట్ కార్డు ఉన్న ఖాతాదారులకు అత్యవసర సమయాల్లో సులభంగా రూ.లక్ష రూపాయల వరకు లోన్ సదుపాయం కల్పిస్తుంది. అయితే, ఈ రుణాలకు మీరు అర్హులా? కాదా? అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు బ్యాంక్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు నుంచి DCEMI అని టైపు చేసి 567676కు పంపాల్సి ఉంటుంది. ఒకవేల మీకు అర్హత ఉన్నట్లయితే, మీకు ఎంత లోన్ లభిస్తుంది అనేది మీకు తెలుస్తుంది.

మీరు ఏదైనా జనరల్ స్టోర్ లేదా షాపింగ్ మాల్ వెళ్లినప్పుడు వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత మీ దగ్గర డబ్బు లేని సమయంలో క్షణాలలో ఎస్‌బీఐ డెబిట్ కార్డు ద్వారా వెంటనే రూ.1,00,000 లోన్ తీసుకోవచ్చు. అలాగే, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కూడా ఎస్‌బీఐ కస్టమర్లు ఈఎమ్ఐ సదుపాయాన్ని వాడుకోవచ్చు. ఈఎమ్ఐ తీసుకునేటప్పుడు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్‌బీఐ ఖాతాదారులు రూ.8,000 నుంచి రూ.లక్ష వరకు రుణ సదుపాయాన్ని పొందవచ్చు.(చదవండి: తక్కువ వడ్డీకే హోమ్ లోన్ అందిస్తున్న టాప్-10 బ్యాంకులు ఇవే!)

ఈ లోన్ మొత్తాన్ని 6, 9, 12, 18 నెలల కాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల వరకు అయితే, ఎంసీఎల్ఆర్(7.20%) + 7.50% వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మొత్తం వడ్డీరేటు అనేది 14.70%గా ఉంటుంది. మీకు రూ.1.25 పైసల వడ్డీ పడుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి.

డెబిట్ కార్డు ఈఎమ్ఐ సదుపాయం

  • మర్చంట్ స్టోర్ వద్ద పీఓఎస్ మెషిన్ పై ఎస్‌బీఐ డెబిట్ కార్డును స్వైప్ చేయండి
  • ఇప్పుడు బ్రాండ్ ఈఎమ్ఐ తర్వాత బ్యాంక్ ఈఎమ్ఐ అనే ఆప్షన్ ఎంచుకోండి.
  • మీకు కావాల్సిన మొత్తం, రుణ కాలపరిమితి రెండు తర్వాత ఎంచుకోవాలి.
  • మీ అర్హత చెక్ చేసిన తర్వాత పీన్ ఎంటర్ చేసి ఓకే మీద ప్రెస్ చేయండి.
  • ఇప్పుడు ఆ రుణ మొత్తం మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది,
  • ఆ తర్వాత రుణ నిబంధనలు, షరతులు ఉన్న ఛార్జ్ స్లిప్ ప్రింట్ వస్తుంది. దాని మీద కస్టమర్ సంతకం చేయాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో ఈఎమ్ఐ సదుపాయం

  • మొదట బ్యాంకులో రిజిస్టర్ చేసిన మొబైల్ నెంబరు సహాయంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా లాగిన్ అవ్వండి.
  • మీకు నచ్చిన వస్తువు కొనుక్కొని పేమెంట్ ఎంపిక మీద క్లిక్ చేయండి.
  • మీకు కనిపించే పేమెంట్ ఆప్షన్ల నుంచి ఈజీ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకొని, ఆ తర్వాత ఎస్‌బీఐ ఎంచుకోవాలి.
  • రుణ కాలపరిమితి ఎంచుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి.
  • ఎస్‌బీఐ లాగిన్ పేజీలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు క్రెడెన్షియల్స్ నమోదు చేయండి.
  • ఒకవేళ లోన్ ఒకే అయ్యి ఆర్డర్ బుక్ అయితే, అప్పుడు నిబంధనలు & షరతులు(టీసీ)కనిపిస్తాయి.
- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles