Download Encumbrance Certificate in Telangana Dharani Portal: తెలంగాణలో వ్యవసాయ భూముల అమ్మకాల, కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2020లో ధరణి పోర్టల్‌ను లాంచ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ వెబ్సైట్ ద్వారా కేవలం ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే కాకుండా.. ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత అనేక సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.
(ఇది కూడా చదవండి: ధరణిలో పట్టాదార్ పాస్‌బుక్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?)
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ ద్వారా భూ లావాదేవిలకు సంబంధించిన ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్’ను కూడా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది అనే విషయం మీకు తెలుసా?. అయితే, ఇప్పుడు మనం ధరణి పోర్టల్‌లో (Encumbrance Certificate) EC డౌన్‌లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..
ధరణి పోర్టల్‌లో (ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్)EC డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?
- ముందుగా మీరు తెలంగాణ ధరణి అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి
- ఓపెన్ అయిన తర్వాత Agriculture అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు ధరణి పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
- ఆ తర్వాత ఎడమ వైపు భాగంలో ఉన్న ఆప్షన్’లలో IM4 Search EC Details అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ జిల్లా, మండలం, గ్రామం, సర్వే నెంబర్, ఖాతా నెంబర్ నమోదు చేయండి.
- మీరు నమోదు చేసిన సర్వే నెంబర్’కు సంబంధించిన భూ లావాదేవీలు వివరాలు కనిపిస్తాయి.
- పక్కన ఉన్న Statement of Encumbrance Certificate PDF మీద క్లిక్ చేస్తే మీకు ఈసీ డౌన్లోడ్ అవుతుంది.
NOTE: ధరణిలో కేవలం 2020 తర్వాత జరిగిన భూ లావాదేవిలకు సంబంధించిన వివరాలు మాత్రమే మీకు కనిపిస్తాయి. అంతకు ముందు, భూ లావాదేవిలకు సంబంధించిన వివరాలు కావాలంటే.. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పోర్టల్’కి వెళ్ళాలి.