Lakshadweep Tourism: ప్రధాని మోడీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత ఆ ప్రదేశం గురించి తెలుసుకోవాలన్న కోరిక పెరిగింది. రోజుకు లక్షకు పైగా మంది లక్షద్వీప్ గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. Boycott Maldives హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నప్పటి నుంచి ‘లవ్ ఫర్ లక్షద్వీప్’ నినాదం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
చాలా మంది మాల్దీవుల టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని మరీ లక్షద్వీప్‌కు వెళ్లేందుకు సిద్ద పడుతున్నారు. మాల్దీవులతో దీటుగా లక్షద్వీప్ కూడా చాలా అందంగా ఉంటుంది. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మాల్దీవులను మించిపోతుంది అని పర్యాటక అభిమానులు కోరుకుంటున్నారు.
లక్షద్వీప్ గురించి(About Lakshadweep):
ఇది 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 36 ద్వీపాలలో విస్తరించి ఉంది. ఈత కొట్టడం, విండ్-సర్ఫింగ్, డైవింగ్, స్నార్కెలింగ్ మరియు కయాకింగ్ వంటివి ఇక్కడ బాగా ప్రసిద్ది చెందాయి. ఇది భూతల స్వర్గం అని చెప్పాలి. అందమైన సముద్ర తీరంలో ఈ దీవులన్నీ మానసిక ప్రశాంతతను ఇస్తాయి. దీని రాజధాని కవరాట్టి.
(ఇది కూడా చదవండి: ప్రజాపాలన దరఖాస్తుల స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?)
ఈ దీవులు మన దేశంలోనే అత్యంత అందమైన ప్రశాంతమైన, ప్రదేశాలలో ఒకటి. 36 దీవుల్లో కేవలం పది దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. భారతదేశంలోని ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో లక్షద్వీప్ కూడా ఒకటి. ఇది 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. 36 ద్వీపాలలో మినియన్ ద్వీపం, కల్పిని ద్వీపం, కద్మత్ ద్వీపం, గోల్డెన్ ద్వీపం, తిన్నాకరా ద్వీపం… చాలా ఫేమస్. ఇక్కడ ఎంతోమంది ప్రజలు నివసిస్తున్నారు.
లక్షద్వీప్ ప్రాంతానికి ఎలా చేరుకోవాలి?(How to Reach Lakshadweep)
లక్షద్వీప్‌కి విమానంలో వెళ్లాలంటే మొదట కేరళలోని కొచ్చికి చేరుకోవాలి. కొచ్చికి దేశంలోని ప్రధాన నగరాల నుంచి ట్రైన్, విమానం సదుపాయాలు ఉన్నాయి. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు విమానాలు, షిప్పులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా కొచ్చి నుంచి లక్షద్వీప్ కు విమానాలను నడుపుతోంది.
(ఇది కూడా చదవండి: ప్రజాపాలన దరఖాస్తుల స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?)
ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా కూడా మొదట కొచ్చిని చేరుకుంటేనే… లక్షద్వీప్ వెళ్ళగలరు. లక్షద్వీప్ వెళ్ళి రావడానికి ఒకవ్యక్తికి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చు అవుతుంది.
లక్షద్వీప్ చూడటానికి పర్మిషన్ తీసుకోవాలా?(How to get Permits for Lakshadweep?)
లక్షద్వీప్‌కు ఎప్పుడు పడితే అప్పుడు చూడటానికి వీలు ఉండదు. కొచ్చిలో లక్షద్వీప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ఉంది. అక్కడకు వెళ్లి లక్షద్వీప్ వెళ్లేందుకు అనుమతి తీసుకోవాలి. మొదట ఇంటర్నెట్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకొని… మీ స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి క్లియరెన్స్ పొందాలి.
క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నాక ఎంట్రీ పర్మిట్లు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎంట్రీ పర్మిట్లు డౌన్లోడ్ చేసుకోలేకపోతే… కొచ్చిలోని విల్లింగ్టన్ ఐలాండ్లో లక్షద్వీప్ అడ్మిన్ స్టేషన్ కార్యాలయం ఉంది. అక్కడకు వెళ్లి పర్మిట్లు తీసుకోవచ్చు. లక్షద్వీప్ చేరుకున్నాక ఈ ఎంట్రీ పర్మిట్లను అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్’కు ఇవ్వాలి. అప్పుడు మీరు లక్షద్వీప్లో చక్కగా పర్యటించవచ్చు.
(ఇది కూడా చదవండి: ప్రజాపాలన దరఖాస్తుల స్టేటస్ ఎలా తెలుసుకోవాలి..?)
కొచ్చి నుంచి మీరు ఓడలో లక్షద్వీప్ చేరుకోవాలనుకుంటే ఎంత లగేజీనైనా తీసుకొని వెళ్ళవచ్చు. కానీ విమానాల్లో అక్కడికి వెళ్లాలనుకుంటే మాత్రం తక్కువ లగేజీ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే విమానాలు చిన్నవిగా ఉంటాయి. ఎక్కువ లగేజీలను అనుమతించరు. కొచ్చి నుంచి లక్షద్వీప్ కు ఏడు నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. వీటిలోనే అందరూ లక్షద్వీప్‌కు చేరుకోవచ్చు.
లక్షద్వీప్ టూర్ ప్యాకేజీలు(Lakshadweep Tour Packages):
- ఒక వ్యక్తి విమానంలో అక్కడికి వెళ్ళి 3 రోజులు గడపటానికి సుమారు రూ. 25 వేల నుంచి ఖర్చు రూ. 30 వేలు అవుతుంది.
- అదే షిప్ లో వెళ్ళి అక్కడ 3 రోజులు గడపటానికి సుమారు రూ. 40 వేల నుంచి ఖర్చు రూ. 50 వేలు అవుతుంది.
- కొన్ని సార్లు మీరు తీసుకునే ప్యాకేజీ బట్టి ఛార్జీలు మారుతాయి అనే విషయం గుర్తుంచుకోవాలి.