Wednesday, May 8, 2024
HomeBusinessPersonal loan: పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే క్రెడిట్‌స్కోరు దెబ్బతింటుందా?

Personal loan: పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే క్రెడిట్‌స్కోరు దెబ్బతింటుందా?

Personal Loan – Credit score: ఆర్థిక అవసరాల నేపథ్యంలో మనం అప్పుడప్పుడు పర్సనల్ లోన్ తీసుకుంటాం. ప్రస్తుతం బ్యాంకులు కూడా విరివిగా వ్యక్తిగత రుణాలను (Personal Loans) అందిస్తున్నాయి. ఈ రుణాలకు ఎలాంటి పూచీకత్తూ లేకపోవడంతో తీసుకునే వారి సంఖ్యా రోజు రోజుకి పెరుగుతోంది.

అయితే, ఈ తరహా లోన్ల విషయంలో చాలా మందికి ఒక అపోహ వెంటాడుతూ ఉంటుంది. పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ (Credit Score) దెబ్బతింటుందేమోనని.. అయితే, ఇందులో ఎంత నిజం ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

(ఇది కూడా చదవండి: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?)

సాధారణంగా బ్యాంకులు మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వ్యక్తులకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తాయి. రుణం తీసుకున్న వ్యక్తి లోన్ తిరిగి చెల్లించగలరా? లేదా? అనేదాని కోసం వారి క్రెడిట్‌ స్కోరును చెక్‌ చేస్తాయి. వారి క్రెడిట్ స్కోరు ఎక్కువగా ఉంటే.. రుణాలు మంజూరు చేస్తాయి. స్కోర్ తక్కువగా ఉంటే లోన్ మంజూరు చెయ్యవు.

మనలో కొంత మందికి పర్సనల్‌ లోన్‌ తీసుకున్నాక క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుందా? అనే ప్రశ్న వారిని వెంటాడుతూ ఉంటుంది. అయితే, అది కేవలం అపోహ మాత్రమే. వ్యక్తిగత రుణం తీసుకున్నంత మాత్రన క్రెడిట్ స్కోరు దెబ్బతినదు. ఇంకా చెప్పాలంటే మీ క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు ఈ రుణం సహాయపడుతుంది.

(ఇది కూడా చదవండి: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?)

మీ అవసరాలకు తగిన పర్సనల్‌ లోన్‌ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లింపులు చేయగలిగితే క్రెడిట్‌ స్కోరు మెరుగవుతుంది. పైగా ఇది భవిష్యత్‌లో హోమ్‌లోన్‌ తీసుకునే సమయంలో తక్కువ వడ్డీకే రుణం పొందడంలో సాయపడుతుంది. అయితే, ఒక పర్సనల్‌ లోన్‌ ఉండగా.. మరో రుణం తీసుకుంటే మాత్రం ఆ ప్రభావం మీ క్రెడిట్ స్కోరుపై పడుతుంది.

- Advertisement -

సాధారణంగా రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు హార్డ్‌ ఎంక్వైరీ చేస్తాయి. కాబట్టి మీ క్రెడిట్‌ స్వల్పంగా తగ్గుతుంది. అయితే, ఆ రుణం కూడా సకాలంలో చెల్లింపులు చేయగలిగితే మీ క్రెడిట్ స్కోరు మళ్లీ మెరుగవుతుంది. అవసరానికి మించి పర్సనల్‌ లోన్‌ తీసుకుని సకాలంలో తిరిగి చెల్లింపులు చేయలేకపోతే మాత్రం క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది.

(ఇది కూడా చదవండి: క్రెడిట్ కార్డుతో ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles