Home Loan Closing Guide: మీరు సొంతంగా ఇల్లు కొనుక్కున్నారా? బ్యాంకులో హోంలోన్ మొత్తం తీర్చేశారా? అయితే మీకు శుభాకాంక్షలు. ఇక మీ ఇల్లు పూర్తి స్థాయిలో మీ చేతికొచ్చేసింది. ఈఎంఐలు మొత్తం చెల్లించామనే ధీమాలో మాత్రం కొన్ని పొరపాటు చేయొద్దు. హోంలోన్ మొత్తం చెల్లించిన తర్వాత అనుభవం లేని కారణంగా మనం చేసే తప్పులు కారణంగా భవిష్యత్ లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే మీ హోంలోన్ చివరి ఈఎంఐ పూర్తి చేసిన తర్వాత ఈ పనులు పూర్తి చేయండి. లేదంటే మీకే నష్టం? ఇంతకి ఆ పనులేంటో తెలుసా?
రుణదాత నుండి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లను తీసుకోండి
ఉదాహరణకు మీ హోంలోన్ ను ఎస్బీఐ నుంచి తీసుకుందామని అనుకుందాం. సకాలంలో లోన్ మొత్తం కట్టేశారు. అనంతరం మీరు లోన్ తీసుకునే సమయంలో ఎస్బీఐ బ్యాంక్ కు ఏ డాక్యుమెంట్లు ఇచ్చారో వాటిని వెనక్కి తీసుకోవాలి. ఈ పత్రాలలో కొన్ని సేల్ డీడ్, టైటిల్ డీడ్, లోన్ అగ్రిమెంట్, పవర్ ఆఫ్ అటార్నీ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లలో అన్నీ పత్రాలు ఉన్నాయా? వాటికి డ్యామేజీ అయ్యిందా? అని నిర్ధారించుకోవాలి
రుణదాత నుండి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ (NDC) పొందండి!
రుణదాత నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకోవాలి. రుణదాత అంటే మీకు హోంలోన్ ఎవరైతే ఇస్తారో వారిని రుణదాత అంటారు. హోంలోన్ మొత్తం చెల్లించారని, ఇకపై కస్టమర్ తమకు ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ.. డాక్యుమెంట్‌లో ఇంటి అడ్రస్, కస్టమర్‌ల పేరు, లోన్ ఖాతా నంబర్, లోన్ మొత్తం, లోన్ ప్రారంభించిన తేదీ, ముగింపు తేదీతో సహా హౌసింగ్ లోన్‌కు సంబంధించిన వివరాలు అన్నీ బ్యాంక్ ఇచ్చే ఎన్ ఓసీలోనే ఉంటాయి. భవిష్యత్తులో మీ ఇంటిని అమ్మాలని అనుకుంటే.. ఆ సమయంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకూడదనుకుంటే ఎన్ డీసీ కాపీలను మీ ల్యాప్ ట్యాప్ లో, లేదంటే మీ కంప్యూటర్ లో భద్రపరుచుకోవడం మంచిది.
మీ ఇంటిపై బ్యాంకుకు హక్కులు లేకుండా చూసుకోవాలి?
కొన్ని సమయాల్లో కస్టమర్లకు బ్యాంకులు హోం లోన్లు ఇస్తాయి. ఆ సమయంలో మీరు తీసుకున్న హోంలోన్ మొత్తం తీర్చే వరకు మీ ఇంటిని అమ్మకుండా, అడ్డుకునే హక్కు బ్యాంకు చేతుల్లో ఉంటుంది. కాబట్టి రుణం తిరిగి చెల్లించిన తర్వాత తాత్కాలిక హక్కును తీసివేయాలి. ఈ ప్రక్రియకు రుణదాత వైపు నుండి ఒక అధికారితో పాటు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించడం అవసరం.
నాన్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ పొందండి?
లోన్ ను పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాత నాన్ ఎన్ కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం తప్పని సరి. ఈ నాన్ ఎన్ కంబరెన్స్ అనేది మీరు హోంలోన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కట్టారు. ఏ తేదీల్లో చెల్లించారానే వివరాలు అందులో ఉంటాయి. దీంతో భవిష్యత్ లో మీపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం బ్యాంకులకు ఉండదు. మీరు మీ హౌసింగ్ లోన్‌ని సెటిల్ చేసిన తర్వాత , రీపేమెంట్ నాన్ ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్‌లో అన్నీ వివరాలు ఉండేలా చూసుకోండి.
మీ క్రెడిట్ రికార్డులు అప్ డేట్ చేసుకోండి?
- క్రెడిట్ రికార్డ్ లు అనేది మీ హోంలోన్ చెల్లించిన తర్వాత అప్ డేట్ అవుతాయి.
- హోంలోన్ చెల్లించడం పూర్తయిన తర్వాత మీ క్రెడిట్ స్కోర్ అప్ డేట్ అయ్యిందా? లేదా అని పరిశీలించాలి.
- హోంలోన్ మొత్తం కట్టేసిన తర్వాత కొన్ని సార్లు మీకు క్రెడిట్ రికార్డ్ లను అప్ డేట్ చేయలేకపోతే.. మీరు లోన్ కట్టలేదని క్రెడిట్ రికార్డ్ లు భావించే అవకాశం ఉంటుంది.
- తద్వారా మీ సిబిల్ స్కోర్ పర్సంటేజీ తగ్గుతుంది. భవిష్యత్ లో ఇతర లోన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మీ క్రెడిట్ రికార్డ్ లను అప్ డేట్ చేసుకోవడం మరిచిపోవద్దు.