Land Registration Charges in Andhra Pradesh(AP): ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల లెక్కింపు అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన రెడీ రికనర్ రేట్లు(RRR) లేదా ఆస్తి మార్కెట్ విలువపై ఆధారపడి ఉంటుంది. మనం ఏదైనా ఒక ఆస్తిని కొనుగోలు చేసినప్పుడు కచ్చితంగా పైన పేర్కొన్న ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దేశంలో ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన మేరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు
ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అనేది ఆ ఆస్తి మార్కెట్ విలువలో 1%, 5% విధిస్తున్నారు. గృహ కొనుగోలుదారులకు ఆస్తి మార్కెట్ విలువలో అదనంగా 1.5% బదిలీ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, గృహ కొనుగోలుదారులు మాత్రం తన లావాదేవీ మొత్తంలో 7.5% ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ అంటే ఏంటి?
What is Stamp Duty: స్టాంప్ డ్యూటీ అనేది రియల్ ఎస్టేట్ లావాదేవీలపై ప్రభుత్వం విధించే పన్ను. ఇల్లు వంటి ఆస్తిని భౌతికంగా కలిగి ఉంటే సరిపోదు. ఆ ఆస్తి చట్టపరమైన యాజమాన్యానికి సంబంధించిన రుజువును కలిగి ఉండాలి. దీని కోసం స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలి.
ఇండియన్ స్టాంప్ యాక్ట్- 1899లోని సెక్షన్ 3 ఏం చెబుతోంది? ఆస్తి టైటిల్‌ను ఇతరుల పేరు మీదకు బదిలీ చేస్తున్నప్పుడు ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.
APలో ఇంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఎలా లెక్కిస్తారు?
ఒక రూ.50 లక్షలు వీలువ గల ఆస్తి మీద ప్రభుత్వం ఎంత మొత్తం రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాంప్ డ్యూటీ(Stamp Duty) = 50,00,000 x 5% = 2,50,000
రిజిస్ట్రేషన్ ఛార్జీలు(Registration Charges) = 50,00,000 x 1% = 50,000
బదిలీ సుంకం(Transfer Duty) = 50,00,000 x 1.5% = 75,000
మొత్తం = రూ. 3,75,000
ఈ విధంగా, మీ రూ. 50 లక్షల విలువైన ఆస్తిని రిజిస్టర్ చేసుకోవడానికి మీరు రూ. 3,75,000 ప్రభుత్వానికి చెల్లించాలి.
APలో ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన పత్రాలు ఏమిటి?
- APలో ఆస్తిని నమోదు చేసేటప్పుడు కింది పత్రాలను సమర్పించాలి.
- అసలు విక్రయ ఒప్పందం(Sale Deed) నమోదిత కాపీ
- స్టాంప్ డ్యూటీ చెల్లింపు రసీదు కాపీ
- తాజా సిటీ సర్వే డిపార్ట్‌మెంట్ ఆస్తి రిజిస్టర్ కార్డ్ కాపీ
- యుటిలిటీ బిల్లుల కాపీ
- విక్రేత, కొనుగోలుదారు గుర్తింపు రుజువు: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి.
- విక్రేత, కొనుగోలుదారు పాస్‌పోర్ట్ ఫోటో