ప్రస్తుతం మనం చూసే ఖరీదైన కంప్యూటరు ధరలు ఎంత ఉంటాయి. మహా అయితే ఒక ఐదు లక్షలో లేదా పది లక్ష్లలో ఉంటుంది. ఇంకాస్త కొంచెం ఎక్కువ పెడితే ఒక కోటి రూపాయలు ఉండవచ్చు. కానీ నేను మీకు ఇప్పుడు చెప్పబోయే కంప్యూటరు ధర ఎంతో తెలుసా అక్షరాల 11 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే దీని ధర రూ.11 కోట్లు. మరి ఆ కంప్యూటరు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. దీనిలో మీరు ఊహించే అంతా హై గ్రాఫిక్స్ ఉండవు. హై పర్ఫార్మన్స్ కూడా ఉండదు. ఇప్పుడు మనం వాడే రూ.20 వేల కంప్యూటరు కంటే చాలా నిధానంగా పనిచేస్తుంది.
మరి దీనికి అంతా ధర పెట్టడానికి ప్రధాన కారణం యాపిల్ కంపెనీ సహ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాకీ కలిసి 1976లో రూపొందించిన తొలి యాపిల్ కంప్యూటరు ఇది. దీని పేరు ‘యాపిల్ -1’. ఇది ప్రసిద్దమైన టెక్ దిగ్గజం యాపిల్ కు చెందిన మొదటి కంప్యూటరు కాబట్టి దీనికి అంత ధర ఉంది. ఇది ప్రస్తుతం కూడా పని చేయడం విశేషం. దీనిని అమెరికాకు చెందిన కృష్ణ బ్లేక్ అనే వ్యక్తి 1978లో 666.66 డాలర్ల(ప్రస్తుత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,70,000)కు కొనుగోలు చేశాడు.(ఇది చదవండి: ఇంట్లో నుంచే 5 నిమిషాలలో మొబైల్-ఆధార్ లింక్!)
ప్రస్తుతం ఈ పురాతనమైన చెక్క కేస్ తో తయారు చేయబడిన కంప్యూటరు ఈ-బేలో అమెరికా $1,500,000(సుమారు 11 కోట్ల రూపాయలు)కు అమ్మకానికి ఉంది. దీనిని కొనుగోలు చేసిన వ్యక్తికి షిప్పింగ్ ధరలు ఆధనం. ‘యాపిల్ -1’ని ఎలా ఉపయోగించాలో తేలీపే యూజర్ మాన్యువల్స్ కూడా అందిస్తారు. కాలిఫోర్నియాలోని వింటేజ్ కంప్యూటర్ ఫెస్టివల్ వెస్ట్ లో ఆగస్టు 2019లో యాపిల్-1 నిపుణుడు కోరే కోహెన్ ఇది నిజమైన, అసలైన కంప్యూటర్ గా దృవీకరించాడు. ఇది “చాలా పురాతనమైన, విలువైన కంప్యూటరు కాబట్టి కొనుగోలు చేసే వ్యక్తికి అందజేసే వరకు దీనిని ఫ్లోరిడాలోని బ్యాంకులో సురక్షితంగా ఉంచినట్లు” ప్రస్తుత యజమాని కృష్ణ బ్లేక్ తెలిపారు.
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.