‘సొంత లాభం కొంత మానుకు.. పోరుగువాడికి తోడుపడవోయ్’ అంటూ మహాకవి చెప్పినట్టుగా సమాజం కోసం భూరిదానం చేసి పేద్ద మనసు చాటుకున్న వారిలో జంపెడ్‌జీ టాటా మొదటి స్థానంలో నిలిచారు. గత శతాబ్దపు ప్రపంచ అతిపెద్ద దాతగా జంపెడ్‌జీ టాటాను హరూన్ జాబితా కీర్తించింది. గడిచిన 100 ఏళ్లలో ఏకంగా 102.4 బిలియన్ డాలర్లు సమాజం కోసం జంపెడ్‌జీ టాటా వెచ్చించినట్టు తెలిపింది. అంటే మన రూపాయిల్లో సుమారు రూ.7.5 లక్షల కోట్లు.
దాతృత్వ కార్యక్రమాలంటే ఎక్కువగా గుర్తుకు వచ్చే బిల్ అండ్ మిలిందాగేట్స్ ఫౌండేషన్ 74.6 బిలీయన్ డాలర్ల విరాళంతో టాటా కంటే వెనుకనున్నట్టు ‘ఎడెల్‌గివ్ హరూన్ ఇండియా టాప్-50 మహాదాతలు జాబితాను’ పరిశీలిస్తే తెలుస్తుంది. టాటా గ్రూపు స్టీల్, సాఫ్ట్‌వేర్, నిత్యావసరాలు ఇలా ఎన్నో వ్యాపారాల్లో ఉన్న విషయం తెలిసిందే. మన దేశం నుంచి టాటాల తర్వాత విష్రో అజీమ్ ప్రేమ్‌జీ ఒక్కరే 22 బిలియన్ డాలర్లను (1.62లక్షల కోట్లు) సేవా కార్యక్రమాల కోసం కేటాయించారు. వారెన్ బఫెట్ 37.4 బిలియన్ డాలర్లు, జార్డ్ సోరోస్ 34.8 బిలియన్ డాలర్లు, జాన్ డీ రాక్‌ఫల్లర్ 26.8 బిలియన్ డాలర్ల చొప్పున సమాజానికి దానం చేశారు.
ఈ జాబితాలో 98 మంది అమెరికాకు చెందిన వారు కాగా, బ్రిటన్ నుంచి ఐదుగురు, చైనా నుంచి ముగ్గురు, భారత్ నుంచి ఇద్దరు, పోర్చుగల్, స్విట్జర్లాండ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. చొప్పున ఉన్నారు. 50 మందిలో ఇప్పటికే 37 మంది కాలం చేశారు. “50 మంది కలసి గత వందేళ్లలో సంయుక్తంగా సమాజం కోసం 382 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. వీరి నుంచి ప్రస్తుతం ఏటా వస్తున్న విరాళం 30 బిలియన్ డాలర్లుగా (2.22లక్షల కోట్లు) ఉంటోంది. ఇందులో మెకెంజే స్కాట్ ఏటా 8.5 బిలియన్ డాలర్లతో అతిపెద్ద వార్షిక విరాళం అందిస్తున్నారు” అని హరూన్ నివేదిక పేర్కొంది.
అమెరికా, ఐరోపా దాతలు గత 100 ఏళ్లలో దాతృత్వపు అలోచనల పరంగా ముందుండొచ్చు.. కానీ, భారత్‌లో టాటా గ్రూపును ఏర్పాటు చేసిన జంపెడ్‌జీ టాటా ప్రపంచంలోనే “అతిపెద్ద దాతగా నిలిచారు. యాజమాన్యంలో మూడింట రెండొంతుల వాటాను. ట్రస్ట్‌లకు టాటా కేటాయించారు. విద్య, ఆరోగ్యసంరక్షణ తదితర రంగాల్లో ఈ ట్రస్ట్‌లు పనిచేస్తున్నాయి. ఇదే టాటాలను సమున్నత స్థానంలో నిలిపింది.
Support Tech Patashala
మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్(Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం మన యూట్యూబ్ (YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.