Facebook-Name-Change as Meta

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ ‘కార్పొరేట్‌’ కంపెనీ పేరు ఇకపై ‘మెటా’గా రూపాంతరం చెందనుంది. ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ అక్టోబర్ 28న జరిగిన కంపెనీ కనెక్ట్‌ ఈవెంట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మేరకు కొత్తలోగో ఆవిష్కరించారు. ఇప్పటి వరకు ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌, మెసెంజర్ సేవలు ఫేస్‌బుక్ కింద పనిచేసేవి. కానీ ఇక నుంచి ఫేస్‌బుక్ తో సహ మిగతా యాప్స్ అన్నీ “మెటా” కింద పనిచేయనున్నాయి అని జూకర్ బర్గ్ తెలిపారు. మెటా అంటే గ్రీకు భాషలో “అంతకు మించి” అని అర్ధం

అంతర్జాతీయంగా ఇటీవల ప్రజాభద్రతకంటే లాభార్జనకే ఫేస్‌బుక్‌ పెద్దపీట వేస్తోందని ఇటీవల తీవ్ర విమర్శలు వస్తున్న తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మాతృసంస్థ పేరు మాత్రమే మారింది తప్ప, దానికింద ఉండే సామాజిక మాధ్యమాల సేవలు పాత పేర్లతోనే కొనసాగానున్నాయి.

‘మెటావర్స్‌’ దిశగా అడుగులు!

‘మెటావర్స్‌’లో భాగంగా‘మెటావర్స్‌’ దిశగా అడుగులు! పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్‌ తెలిపారు. వర్చువల్‌-రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, తత్సబంధ అంశాలు ‘మెటావర్స్‌’ పరిధిలోకి వస్తాయి. ‘యాప్స్‌’ నుంచి మరింత సాంకేతిక పరిపక్వత కలిగిన ‘మెటావర్స్‌’దిశగా మెటా అడుగులు వేస్తుందని కూడా ఈ సందర్భంగా జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు. ‘‘ఒకరికి ఒకరిని కలిపి ఉంచడానికి సాంకేతికతను ఆవిష్కరించే కంపెనీ మనది. వెరసి మన సాంకేతికతలో ప్రజలను ఒక చోటు కేంద్రీకరించవచ్చు. తద్వారా అందరూ కలిసి ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతికి దోహదపడవచ్చు’’ అని ఈ సందర్భంగా జుకర్‌బర్గ్‌ పేర్కొన్నారు.