Thursday, April 18, 2024
HomeStoriesBeer Bottles: కంపెనీ ఏదైనా బీరు సీసా ఆ రెండు రంగుల్లోనే ఎందుకు ఉంటుంది?

Beer Bottles: కంపెనీ ఏదైనా బీరు సీసా ఆ రెండు రంగుల్లోనే ఎందుకు ఉంటుంది?

బీరు అంటే తెలియని వారు అతి కొద్ది మంది ఉంటారు. మన దేశంలో యువత బాగా తాగేది ఏదైనా ఉంది అంటే? బీరు అని చెప్పుకోవాలి. ఆదివారం వచ్చింది అంటే చాలు బ్యాచిలర్ రూముల్లో బీరు ఎరులై పారాల్సిందే. బీరు అంటే అంత ఇష్టం నేటి కుర్రాళ్లకు. ఎండాకాలం అయితే సేల్స్ మాములగా ఉండవు. ఇక పండగలు..పబ్బలు.. పుట్టిన రోజులు అంటే చాలు బీర్ పొంగాల్సిందే. బీరు తాగేవారికి సరదాగానే ఉన్న.. బీర్ తాగని వ్యక్తులకు చాలా చికాకుగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే బీర్ తాగే చాలా మంది ఆరోగ్యానికి మంచిదని నమ్ముతుంటారు.

అయితే, ఈ రోజు మనం బీర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. బీర్ బ్రాండ్ అది ఏదైనా కావచ్చు.. సీసా మాత్రం ఆకుపచ్చ, గోధుమ రంగుల్లోనే ఉంటుంది. ఎందుకు ఈ రంగుల్లో ఉంటాయి అని మీకు ఆలోచించారా? ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తుంటాయి. అసలు సంగతి తెలిస్తే చాలా మంది షాక్ అవుతారు. ప్రాచీన మెసొపొటేమియా సుమేరియన్ నాగరికత కాలం నుంచి బీరును తాగుతున్నారు. 7 వేల ఏళ్ల క్రితం మెసోపోటామియా సంస్కృతిలో బీరు తాగడం ఆచారంగా ప్రారంభమైంది.(చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త!)

వేలాది సంవత్సరాల క్రితం పురాతన ఈజిప్టులో మొట్టమొదటి బీర్ కంపెనీ ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు బీర్ ప్యాకింగ్ ఒక పారదర్శక తెల్లటి గాజు సీసాలో ప్యాక్ చేసేవారు. అయితే బీర్‌లో ఉండే ఆమ్లంతో సూర్య కిరణాల నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్య జరగడంతో ఆ బీర్ చెడిపోవడం జరిగేదాని వారు గుర్తించారు. దీంతో ఆ బీర్ చాలా దుర్వాసన రావడంతో పాటు తాగడానికి ఉపయోగపడకుండా పోతుందని తయారీదారులు తెలుసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. (చదవండి: రేషన్ కార్డుదారులకు కేంద్రం శుభవార్త!)

ప్రణాళికలో భాగంగా గోధుమ రంగు పూసిన సీసాలు బీర్ కోసం ఎంపిక చేసుకున్నారు. ఈ ట్రిక్ చాలా భాగ పని చేసింది. ఇలా రంగు సీసాలో పోసిన బీరు చెడిపోకుండా సురక్షితంగా ఉంది. అంతే కాదు చెడిపోకుండా వాసన, రుచి మారిపోలేదు. ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో బీరు ఆకుపచ్చ రంగు సీసాలో వేయడం మొదలు పెట్టారు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గోధుమ సీసాల కొరత ఏర్పడింది. ఈ రంగు సీసాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితిలో బీర్ తయారీదారులు మరో రంగును ఎంచుకోవల్సి ఉచ్చింది. ఆ సమయంలో గోదుమ రంగు సీసాల స్థానంలో ఆకుపచ్చ రంగు సీసాలను ఉపయోగించారు. అప్పటి నుంచి ఈ రెండు రంగులను బీర్ సీసాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇదిండీ.. బీర్ సీసా రంగు చరిత్ర. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles