Saturday, July 20, 2024
HomeStoriesవిజయ్ మాల్య వంటి ఆర్దిక నేరగాళ్లు బ్రిటన్ కు ఎందుకు పారిపోతున్నారు?

విజయ్ మాల్య వంటి ఆర్దిక నేరగాళ్లు బ్రిటన్ కు ఎందుకు పారిపోతున్నారు?

లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఆర్దిక నేరగాళ్లు ప్రస్తుతం లండన్‌లో తల దాచుకుంటున్నారు. ఆర్దిక నేరగాళ్ల నుంచి మొదలు పెడితే ఉగ్రవాదుల వరకు ప్రతి ఒక్కరూ బ్రిటన్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. 1991 నుంచి ఇప్పటివరకు 200 నేరగాళ్లు లండన్ కి పారిపోయారు. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు. మనం వాళ్లను ఎందుకు ఇండియాకు తీసుకురాలేకపోతున్నాం అని. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురుంచి క్లుప్తంగా తెలుసుకుందాం.(చదవండి: భవిష్యత్ లో ప్రపంచంలో రాబోయే భారీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టు ఇదే!)

ఆర్దిక నేరగాడు నీరవ్ మోడీ భారత్ నుంచి పారీపోయి లండన్‌లో ఉంటున్నారు. నీరవ్ మోడిని అప్పగించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు బ్రిటిష్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని బ్రిటిష్ మంత్రి బారోనెస్ విలియమ్స్ తనకు హామీ ఇచ్చినట్లు భారత హోంమంత్రి గతంలో పేర్కొన్నారు. కానీ, అది కేవలం హామీలకు మాత్రమే పరిమితం అయ్యింది. మనం గత ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే 1991 నుంచి ఇప్పటివరకు కేవలం ఒక్కరినే మాత్రమే బ్రిటన్ “నేరస్థుల అప్పగింత ఒప్పందం” కింద అప్పగించింది.

ఆర్దిక నేరగాళ్లకు బ్రిటన్ స్వర్గధామం

వాస్తవానికి ఆర్థిక మోసాలకు పాల్పడిన వ్యక్తులు దేశానికి ఎప్పుడు వస్తారని ఆశగా బ్రిటన్ ఎదురుచూస్తుంది. తద్వారా దోచుకున్న సంపద బ్రిటన్ లోని బ్యాంకులలో ఉంటుంది. లలిత్ మోడీ, విజయ్ మాల్యా తరువాత బ్రిటన్లో ఆశ్రయం పొందిన మూడవ భారతీయ బిలియనీర్ నీరవ్ మోడీ. మొదట ఆశ్రయం పొందిన తర్వాత నేరగాళ్లు అక్కడి గోల్డెన్ వీసా కోసం ధరఖాస్తు చేసుకుంటారు. ఈ గోల్డెన్ వీసా కోసం కోసం ఆర్దిక నేరగాళ్లు బ్రిటిష్ ప్రభుత్వానికి 200 కోట్లు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా వారికి కొన్ని రక్షణలు లభిస్తాయి. అక్కడ వీరు సొంతిల్లు లేదా సొంత వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు.

ఆర్దిక నేరగాళ్లను అప్పగించాలనే వాదనలు బ్రిటిష్ కోర్టులలో మొదలైనప్పుడు అక్కడి చట్టాలు వారికి రక్షణగ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం భారత్ నుంచి పారిపోయిన లలిత్ మోడీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఆర్దిక నేరగాళ్లతో పాటు టైగర్ హాని(గుజరాత్ బాంబ్ కేసు నిందితుడు) ఉగ్రవాది కేసులకు సంబందించి వాదనలు అక్కడ కొనసాగుతున్నాయి.(చదవండి: ప్రపంచంలోనే భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇదే!)

- Advertisement -

వీరిని తిరిగి భారత్ కు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నప్పటికి కూడా చాలా సార్లు అక్కడి కోర్టులు కొన్ని కారణలచే అడ్డుకుంది. భారత ప్రభుత్వం వారి సొంత రాజీకియ ప్రయోజనల కోసం వీరిని ఒక పావుగా వాడుకున్నట్లు అక్కడి కోర్టులు అభిప్రాయపడ్డాయి. మరోసారి ఇండియాలోని జైళ్లు ఖైదులు నివసించడానికి అనువుగా ఉండవని మరో వాదనలో పేర్కొంది. వారి కోసం ప్రత్యేక జైళ్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నప్పటికి కూడా పట్టించుకోలేదు.

56 లక్షల కోట్లు మళ్లింపు

ఇలా ఇతర దేశాల నుంచి పారిపోయి వచ్చిన నేరగాళ్లకు ఆశ్రయం కల్పించడానికి ప్రధాన కారణం డబ్బు. కేవలం 2006 నుంచి 2015 ఇతర దేశాల నుంచి వచ్చిన వారి నుండి 9 లక్షల కోట్ల రూపాయలను బ్రిటన్ సంపాదించినది. కరప్షన్ వెల్త్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. గత కొన్నేళ్లుగా వివిద దేశాలకు చెందిన 56 లక్షల కోట్ల రూపాయల డబ్బు బ్రిటన్ లో ఉంది. ఈ డబ్బుపై అక్కడి బ్యాంకులు కానీ ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేవు. అందుకే చాలా మంది నేరగాళ్లు బ్రిటన్ కు పారిపోతారు.

గత ఏడేళ్లలో మన దేశంలోని 5,500 మంది బ్రిటన్ లో ఆశ్రయ కోసం ధరఖాస్తు చేసుకున్నారు. 1992 బ్రిటన్, ఇండియా మద్య నేరస్థుల అప్పగింత ఒప్పందం కుదిరింది. అప్పటి నుంచి పారిపోయిన 132 నేరగాళ్లలో ఈ ఒప్పందం కింద ఒకే ఒక్క నెరగాన్ని అప్పగించింది. వీటిలో చాలా వరకు కోర్టు వాదనలలోనే ఉన్నాయి. అదే అమెరికా నుంచి 2004 – 2011 మద్యలో బ్రిటన్ కు పారిపోయిన 130 నేరగాళ్లలో 120 మందిని తిరిగి అమెరికాకు అప్పగించింది.

గత 5 ఏళ్లలోనే మన దేశం నుండి 58 మంది నేరగాళ్లు బ్రిటన్ కు పారిపోయారు. ఈ ఆర్దిక నేరగాళ్ల కారణంగా భారత్ 5,40,000 కోట్ల మొండి బకాయలను రద్దు చేయాల్సి వచ్చింది. మన దేశంలో ఇతర దేశాలతో పోల్చినంత కఠినంగా చట్టాలు ఉండవు. అదే రష్యాలో అయితే వారి ఆస్తి మొత్తం స్వాదినం చేసుకోవడంతో పాటు జీవిత కాలం జైలు శిక్ష విధిస్తారు. అలాగే చైనాలో ఆర్దిక నేరానికి పాల్పడిన వారిని వెంటనే ఊరి శిక్ష విధిస్తారు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. అలాగే తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles