Honda Activa Electric Scooter: హోండా యాక్టివా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోనే బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఈ స్కూటర్ మార్కెట్‌లో ఏకంగా 50 శాతం ఈ ఒక్క స్కూటర్ ఆక్రమించింది. అయితే, ఇలాంటి క్రేజీ స్కూటర్’కి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2024 జనవరిలో లాంచ్ చేస్తామని కంపెనీ సీఈవో ఇటీవలనే ప్రకటించారు.
అయితే, ఒక వ్యక్తి మాత్రం కంపెనీ కన్నా ముందుగానే హోండా యక్టివాలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకువచ్చారు. నెల్లూరుకి చెందినా ఒక వ్యక్తి పెట్రోల్ హోండా యాక్టివాను ఎలక్ట్రిక్ హోండా యాక్టివాగా మార్చేశారు. ఈ ఎలక్ట్రిక్ హోండా అసలైందా? లేదా మోడిఫైడా? అనే రీతిలో అంత పర్ఫెక్ట్‌గా హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చేశారు.
పాత హోండా యాక్టివా స్కూటర్‌ను తీసుకొని అందులోని ఇంజిన్ మార్పిడి చేసి ఆ తర్వాత అందులో స్వాపబుల్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 1 కేడబ్ల్యూ బ్యాటరీని అమర్చారు. దీన పవర్ 2 నుంచి 2.5 కేడబ్ల్యూ వరకు ఉంది. దీనిని ఒక్కసారి చార్జింగ్ పెడితే ఇది 120 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. అలాగే దీనిలో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అమర్చారు.
వెనుక భాగంగా స్ప్రింగ్ బేస్డ్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే కనిపిస్తోంది. హోండా పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చడానికి దాదాపు రూ. లక్ష ఖర్చు అయిందని తెలుస్తోంది. బ్యాటరీ ఫుల్ కావడానికి 6 గంటల సమయం పడుతుంది. బ్యాటరీపై మూడేళ్ల వరకు వారంటీ కూడా లభిస్తుంది. వైట్ రంగులో ఈ స్కూటర్ బాగుంది అని చెప్పుకోవచ్చు.