Thursday, April 25, 2024
HomeHow ToGratuity Benefits in Telugu: జాబ్ మానేస్తున్నారా?.. అయితే, గ్రాట్యుటీ ప్రయోజనాల గురించి తెలుసా?

Gratuity Benefits in Telugu: జాబ్ మానేస్తున్నారా?.. అయితే, గ్రాట్యుటీ ప్రయోజనాల గురించి తెలుసా?

How To Calculate Gratuity Amount in Telugu: మనం కొన్నిసార్లు జీవితంలో ఎదిగే క్రమంలో ఒక కంపెనీ నుంచి ఇతర కంపెనీలు మారుతుంటాము. ఇలా, మారే సమయంలో పాత సంస్థ నుంచి గ్రాట్యుటీ వంటి కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియవు, అయితే, ఇప్పుడు మనం గ్రాట్యుటీ అంటే ఏంటి..? కంపెనీల్లో పనిచేసే ఎలాంటి ఉద్యోగులు గ్రాట్యూటీ అందుకునేందుకు అర్హులు.. అనే వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

గ్రాట్యుటీ అంటే ఏమిటి..?

గ్రాట్యూటీ అంటే ఒక వ్యక్తి పూర్వ కంపెనీకి చేసిన సేవలకుగాను ఆ సంస్థ ఉద్యోగికి కొంత మొత్తంలో చెల్లించే డబ్బులే గ్రాట్యూటీ అని అంటారు.

గ్రాట్యుటీకి ఎవరు అర్హులు?

గ్రాట్యూటీ అందుకోవాలంటే ఎవరు అర్హులు ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలనే అంశం మీద చాలామందికి తెలియదు. గ్రాట్యుటీ అనేది ఒక వ్యక్తి పూర్వ లేదా రాజీనామా చేసిన కంపెనీలో కనీసం 5 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు ఈ గ్రాట్యుటీని చెల్లిస్తాయి. మీకు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 మేరకు కంపెనీలు ఆ డబ్బులు చెల్లిస్తాయి.

(ఇది కూడా చదవండి: భూ పహాణీ కోసం ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి? భూ పహాణీ కోసం ఎంత రుసుము చెల్లించాలి)

గ్రాట్యుటీ కావాల్సిన అర్హతలు?

  • గ్రాట్యుటీ అర్హత కోసం మీరు క్రింది ప్రమాణాలకు సరిపోవాలి:
  • ఉద్యోగి సూపర్‌యాన్యుయేషన్‌కు అర్హత కలిగి ఉండాలి.
  • ఉద్యోగి ఉద్యోగం నుండి రిటైర్ కావాలి.
  • ఒక ఉద్యోగి ఒక సంస్థలో 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కంపెనీకి రాజీనామా చేసి ఉండాలి.
  • అనారోగ్యం లేదా ప్రమాదం కారణంగా మరణం లేదా వైకల్యం సంభవించాలి.

గ్రాట్యుటీ ఫార్ములా లేదా ఎలా లెక్కిస్తారు?

గ్రాట్యుటీ ఫార్ములా: చివరిగా తీసుకున్న జీతం X 15/26 X సంవత్సరాల సర్వీస్ సంఖ్య

- Advertisement -

ఉదాహరణకు మీరు పాత కంపెనీ నుంచి రూ.50,000 వేలకు పైగా జీతం తీసుకుంటే.. మీకు సుమారు రూ.1,50,000 వరకు గ్రాట్యుటీ లభించే అవకాశం ఉంది.

EX: Rs 50,000(జీతం) * 15/26 * 5 ఏళ్లు = 144230 (గ్రాట్యుటీ ఫండ్)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles