PM Vishwakarma Yojana Scheme Full Details in Telugu: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పేరుతో మరో కొత్త పథకం తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. చేతి వృత్తుల వారిని ఆదుకునేందుకు కోసం ఈ పథకం కింద రూ.13 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్రం తెలిపింది.
సాంప్రదాయ హస్త, కళా నైపుణ్యాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలగనున్నట్లు ఆయన తెలిపారు.
పీఎం విశ్వకర్మ యోజన ఉద్దేశ్యం ఏమిటి?
సాంప్రదాయ హస్త, కళా నైపుణ్యాల పెంపునకు ఆర్థిక సహాయం అందించడం కోసం కేంద్రం ఈ పథకం తీసుకొని వచ్చింది. పీఎం విశ్వకర్మ యోజన పథకం కోసం రూ. 13,000 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ పథకాన్ని 5 సంవత్సరాల కాలం పాటు అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం మొదలుకొని 2027-28 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
(ఇది కూడా చదవండి: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)
చేతివృత్తుల చేసుకునే వారు, హస్తకళల నిపుణులు రూపొందించే వస్తువులు & సేవల నాణ్యతను మెరుగు పరిచి దేశీయంగా, విదేశీ వ్యాపారులతో వారిని ముడి పడేటట్లు చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది. దీంతో వారి ఉత్పత్తులు విదేశాలలో కూడా అమ్ముడు అయ్యే అవకాశం ఉంటుంది.
పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రయోజనాలు?
- ఈ పథకం కిందం పీఎం విశ్వకర్మ యోజన సర్జిఫికెటును, గుర్తింపు కార్డును అందిస్తారు.
- మొదటి దశలో – ఒక లక్ష రూపాయల, రెండవ దశలో – 2 లక్షల రూపాయల రుణాన్ని 5 శాతం సబ్సిడీ వడ్డీతో అందిస్తారు.
- ఈ పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణ, పనిముట్టులకు సంబంధించి ప్రోత్సాహకాలు, డిజిటల్ ట్రాన్సాక్షన్, సహాయ సహకారాలను కూడా అందిస్తారు.
- పీఎం విశ్వకర్మలో రెండు రకాల నైపుణ్య శిక్షణలో ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది.
- బేసిక్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ మరియు అద్వాన్స్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఉంటాయని తెలిపింది.
- లబ్ధిదారులకు శిక్షణ కాలంలో రోజుకి రూ.500 చొప్పున స్టైపెండ్ ఇవ్వనున్నారు.
- అలాగే ఆధునిక యంత్రాలు, కొనుక్కోవడానికి పరికరాలు రూ.15,000 వరకూ ఆర్థిక సాయం అందజేయనున్నారు.
- మొదటి ఏడాది 5లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది.
- వచ్చే ఐదేళ్లలో మొత్తం 30 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి.
- తొలుత 18 రకాల సంప్రదాయ చేతి వృత్తుల చేసుకునే వారికి ఈ పథకం కిందం సహకారం అందించనున్నారు.
ఏ హస్త కళాకారులకు సహాయం అందించనున్నారు..
పీఎం విశ్వకర్మ యోజన పథకం కింద వడ్రంగులు, పడవల తయారీదారులు, ఆయుధ /కవచ తయారీదారులు, కమ్మరులు, సుత్తి & ఇంకా పరికరాల తయారీ దారులు, తాళాల తయారీదారులు, బంగారం పని ని చేసే వారు, కుమ్మరులు, శిల్పులు (ప్రతిమలు, రాతి చెక్కడం పని చేసేటటువంటి వారు), రాళ్ళను పగులగొట్టే వృత్తిలో ఉండే వారు, చర్మకారులు/పాదరక్షల తయారీ దారులు, తాపీ పనివారు, గంపలు/చాపలు/బీపురులను తయారు చేసేవారు, కొబ్బరి నారతో తయారు అయ్యే వస్తువుల ను చేసే వారు(సాంప్రదాయిక ఆటబొమ్మల రూపకర్తలు), నాయి బ్రాహ్మణులు, మాలలు అల్లే వారు, రజకులు, దర్జీలు, చేపలను పట్టేందుకు ఉపయోగించే వలలను తయారు చేసే వారికి సహాయం అందిస్తారు.
ఈ పథకం దరఖాస్తుకు కావాల్సిన అర్హతలు:
- పిఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజనకు అర్హత పొందేందుకు దరఖాస్తుదారులు తప్పనిసరిగా భారతీయ పౌరులు అయి ఉండాలి.
- విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ యోజన ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తుదారు సంప్రదాయ శిల్పకారుడు లేదా హస్తకళాకారుడు అయి ఉండాలి.
- స్కీమ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి వయో పరిమితి లేదు.
పీఎం విశ్వకర్మ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?(PM Vishwakarma Yojana Online Apply)
- మొదట పీఎం విశ్వకర్మ యోజన పోర్టల్ (https://pmvishwakarma.gov.in/) ఓపెన్ చేయండి.
- ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసి CSC Login లాగిన్ ఎంచుకొని CSC – Register Artisans మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత CSC Username, Password నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- ఇప్పుడు 2 సార్లు No Select చేసుకొని Continue మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ఆధార్ లింకు చేసిన మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ & క్యాప్చా కోడ్ నమోదు చేసి Continue మీద క్లిక్ చేయాలి.
- ఇప్పుడు మీ మొబైల్ నెంబర్’కి వచ్చిన OTP నమోదు చేసి Continue మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Biometric Verify చేయాల్సి ఉంటుంది.
- ఇప్పుడు మీ వివాహ స్థితి, Gender, Caste, అంగవైకల్యం వివరాలు నమోదు చేయాలి.
- అలాగే, మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ వివరాలు నమోదు చేయాలి.
- ఇంకా మీ వ్యాపారానికి సంబందించిన వివరాలు నమోదు చేయాలి.
- ఇప్పుడు మీ బ్యాంకుకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.
- మీకు ఎంత నగదు కావాలో నమోదు చేయాలి.
- మీకు గూగుల్ పే, ఫోన్ పే వాడితే వాటి అడ్రసు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.