Friday, December 6, 2024
HomeHow ToLand Registration Charges in Telangana: తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతో తెలుసా..?

Land Registration Charges in Telangana: తెలంగాణలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతో తెలుసా..?

Stamp Duty and Registration Charges in Telangana: ఈ ప్రపంచంలో ఎప్పటికీ తరగని ఆస్తి ఉన్నది అంటే అది భూమి మాత్రమే అని చెప్పుకోవాలి. దీని విలువ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఎన్నటికీ తరగదు. అయితే, మనం ఒక భూమిని కొన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తుంది.

(ఇది కూడా చదవండి: తెలంగాణ ధరణి పోర్టల్‌లో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంతో తెలుసా?)

అయితే, వీటి గురించి చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అందుకే, మనం ఈ స్టోరీలో స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అంటే ఏమిటి?.. తెలంగాణలో వీటి ఛార్జీలు ఎంత అనే దాని గురించి తెలుసుకుందాం..

స్టాంప్ డ్యూటీ(Stamp Duty) అంటే ఏమిటి?

స్టాంప్ డ్యూటీ అంటే భూ లావాదేవీలపై ప్రభుత్వం విధించే పన్ను. మనం ఏదైనా ఒక ఆస్తిని కొనగానే అక్కడితో ఆ ప్రక్రియ పూర్తి కాదు. ఆ ఆస్తికి చట్టపరమైన యాజమాన్యానికి సంబంధించిన రుజువు కోసం ప్రతి ఒక్కరూ భూ కొనుగోలు సమయంలో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు తప్పనిసరిగా చెల్లించాలి.

అయితే స్టాంప్ డ్యూటీ అనేది తెలంగాణలో భూ విలువ మీద గరిష్టంగా 15 శాతం ఉంటే, కనిష్టంగా 0.40 శాతం ఉంది. మీరు సేల్ డీడ్ చేసుకుంటే స్టాంప్ డ్యూటీ అనేది గరిష్టంగా 6.50, కనిష్టంగా 0.50 శాతంగా ఉంది.

- Advertisement -

ట్రాన్స్‌ఫర్ డ్యూటీ(Transfer Duty) అంటే ఏమిటి?

ట్రాన్స్‌ఫర్ డ్యూటీ అంటే భూ యాజమాన్య హక్కులను ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీద మార్చడానికి ప్రభుత్వ వసూలు చేసే చార్జీలను ట్రాన్స్‌ఫర్ డ్యూటీ అంటారు. తెలంగాణలోభూ విలువ మీద ట్రాన్స్‌ఫర్ డ్యూటీ అనేది 1.50 శాతంగా ఉంది.

రిజిస్ట్రేషన్ ఫీజు(Registration Fee) అంటే ఏంటి?

రిజిస్ట్రేషన్ ఫీజు అనేది స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటినీ వేర్వేరుగా లెక్కిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కోర్టు వసూలు చేసే రుసుము. ఇది రిజిస్ట్రేషన్ చట్టం కిందకు వస్తుంది. ఇది ప్రాథమికంగా కొనుగోలుదారులు, అమ్మకందారుల మధ్య జరిగే టెర్మినల్ లీగల్ ఒప్పందం.

ఆస్తిపై యాజమాన్యం ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి మారిందనే నోట్‌ను ఈ లీగల్ అగ్రిమెంట్ కలిగి ఉంటుంది. ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్- 1908లోని సెక్షన్ 17 ప్రకారం.. ఆస్తుల బదిలీ, అమ్మకం, లీజు వంటి ఒప్పందాలు జరిగితే, తప్పకుండా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయించాలి.

(ఇది కూడా చదవండి: Land Pahani: భూ పహాణీ, అడంగళ్‌/పహాణీ, ఖాస్రా పహాణీ అంటే ఏమిటి? వాటి కోసం దరఖాస్తు చేసుకోవడం ఎలా..?)

రిజిస్ట్రేషన్ పీజు అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. తెలంగాణలోభూ విలువ మీద రిజిస్ట్రేషన్ ఫీజు అనేది గరిష్టంగా 5 శాతం ఉంటే, కనిష్టంగా 0.20 శాతంగా ఉంది. పైన పేర్కొన్న స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేవి రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి.

తెలంగాణలో వ్యవసాయేతర భూముల స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎంత అనేది పూర్తిగా తెలుసుకోవడం కోసం ఈ లింకు https://registration.telangana.gov.in/readyReckoner.htm ఓపెన్ చేయండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles