Mobile Phone Buying Guide in Telugu: మీరు త్వరలో రాబోయే Flipkart(ఫ్లిప్‌కార్ట్), Amazon(ఆమెజాన్) డీల్స్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా?. అయితే, మీరు కొనేముందు ఈ కథనం పూర్తిగా చదవండి. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాల గురించి మనం ఇప్పుడు తెలసుకుందాం.
(ఇది కూడా చదవండి: అదిరిపోయిన జియో భారత్ 4జీ ఫోన్.. ధరెంతో తెలుసా!)
బడ్జెట్(Budget):
మొదట ఏ వస్తువునైనా కొనడానికి ముందు మన దగ్గర బడ్జెట్ ఎంత, మన అవసరాలు ఏంటి అనేది తప్పకుండా తెలుసుకోవాలి.
మీ అవసరాలను గుర్తించండి:
ముందుగా మీకు ఎలాంటి మొబైల్ అవసరమో( అంటే హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్, మిడ్ లెవల్, బడ్జెట్ లెవల్ ఫోన్ కావాలో) తెలుసుకోవాలి. అలాగే, మీకు కెమెరా, గేమింగ్, మల్టీ టాస్కింగ్ ఫోన్ కావాలో తెలుసుకోవాలి.
ఆపరేటింగ్ సిస్టమ్(OS):
మీకు, క్లీన్ ఆండ్రాయిడ్ మొబైల్ కావాలా?.. బ్లోట్ వేర్ మొబైల్ కావాలో తెలుసుకోండి.
పనితీరు(Performance):
చాలా మంది యువతకు మంచి పనితీరు గల మొబైల్ కొనేందుకు ఆసక్తి కనబరుస్తారు. మీ మొబైల్ స్పీడ్’గా పనిచేయాలంటే మంచి ప్రాసెసర్, ఎక్కువ ర్యామ్ గల మొబైల్ తీసుకోవడం మంచిది. గేమింగ్ కోసం అయితే, అదనంగా శక్తివంతమైన GPUలు ఉన్న ఫోన్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రదర్శన(Screen):
ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో పెద్ద స్క్రీన్ సైజ్ గల మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. మీ మొదట ప్రాధాన్యత స్క్రీన్ అయితే.. పెద్ద స్క్రీన్ కంటే OLED/AMOLED డిస్‌ప్లే గల మొబైల్తో పాటు రిఫ్రెష్ రేట్లు (ఉదా., 90Hz లేదా 120Hz) అధికంగా ఉంటే మంచిది.
కెమెరా(Camera):
మీ ప్రాధాన్యత కెమెరా అయితే.. బహుళ లెన్స్‌లతో సహా (వైడ్, అల్ట్రా-వైడ్, టెలిఫోటో) మంచి కెమెరా సెటప్ ఉన్న ఫోన్ కోసం చూడండి. కేవలం మెగాపిక్సెల్‌లపై దృష్టి పెట్టకుండా.. ఇమేజ్ ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్ లక్షణాలను పరిగణించండి.
బ్యాటరీ లైఫ్(Battery Life):
మీ ప్రాధాన్యత బ్యాటరీ అయితే.. 4,000mAh కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్ కోసం చూడండి.
కనెక్టివిటీ(Connectivity):
మీరు ఫోన్ కొనేముందు 5G సపోర్ట్ గల మొబైల్ తీసుకోవడం మంచిది. అలాగే, Wi-Fi 6, బ్లూటూత్ 5.0 లేదా కొత్తది, NFC మరియు USB-C సపోర్ట్ వంటి ఫీచర్‌ల కోసం తనిఖీ చేయండి.
సర్విస్(Service):
మంచి సర్విస్ అందించే కంపనీకి చెందిన మొబైల్ తీసుకోవడం చాలా మంచిది.
ధరలను సరిపోల్చండి(Price Comparison):
మీరు ఏదైనా ఫోన్ కొనే ముందు.. అదే శ్రేణిలో ఇతర కంపనీలకు చెందిన మొబైల్’తో పోల్చుకొని కొనడం చాలా మంచిది.
మరిన్ని టెక్ పాఠశాల తాజా వార్తల కోసం ఈ క్రింది ఉన్న లింక్స్ ఫాలో అవ్వండి:
టెక్ పాఠశాల వాట్సాప్ చానెల్: https://whatsapp.com/channel/0029VaAjDNLCcW4hxsv3pk1N
టెక్ పాఠశాల ఫేస్బుక్ పేజీ: https://www.facebook.com/TechPatashala/
టెక్ పాఠశాల ట్విట్టర్ పేజీ: https://twitter.com/TechPatashala
టెక్ పాఠశాల టెలిగ్రాం గ్రూప్: https://t.me/techpatashala