Sunday, October 13, 2024
HomeTechnologyAppsడెబిట్ కార్డు లేకుండా ఎటిఎంలో డబ్బులు డ్రా చేయండి ఇలా?

డెబిట్ కార్డు లేకుండా ఎటిఎంలో డబ్బులు డ్రా చేయండి ఇలా?

దేశంలోని అతిపెద్ద పిఎస్‌యు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు ఎస్‌బిఐ డెబిట్ కార్డు లేకపోయినా ఎటిఎం నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే, ఎస్‌బిఐ తన వినియోగదారులకు ఎంపిక చేసిన ఎస్‌బిఐ ఎటిఎంలలో ఈ సౌకర్యాన్ని ఇస్తోంది. ఒక ఎస్బిఐ ఖాతాదారుడు తన స్మార్ట్ ఫోన్ లో ఎస్‌బీఐ యోనో యాప్ ను కలిగి ఉంటే ఎస్‌బీఐ ఎంపిక చేసిన ఎటిఎంల నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చు.(ఇది చదవండి: సాదారణంగా ఇంటర్ నెట్ స్పీడ్ ఎందుకు తక్కువగా వస్తుంది?)

సింగిల్ ట్రాన్సాక్షన్‌లో రూ.10,000 ఎక్కువ డ్రా చేయలేరు

ఒక ఎస్‌బీఐ ఖాతాదారుడు తన యోనో యాప్ లాగిన్ ఐడి, పాస్ వర్డ్ ఉపయోగించి యోనో యాప్ లోకి లాగిన్ అవ్వవచ్చు. ఆ తరువాత, SBI ఖాతాదారుడు 6-అంకెల MPINని సెట్ చేసుకోవాలి. ఇది భవిష్యత్తులో సులభంగా లాగిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎస్బిఐ యోనో యాప్ లో లాగిన్ అయిన తరువాత, ఎస్బిఐ ఖాతాదారుడు Request YONO cash పైన క్లిక్ చేయాలి. మీరు ఒకసారి రూ.10,000 కన్న ఎక్కువ డబ్బును డ్రా చేయలేరు ఇది గుర్తుంచుకోవాలి.(ఇది చదవండి: ఇంటి అవసరాల కోసం ఎంత ఇంటర్నెట్ వేగం అవసరం?)

ఏటీఎంకు వెళ్లిన తర్వాత ‘Card-Less Transaction’ను ఎంచుకోవాలి. మీరు క్రియేట్ చేసిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మరో పిన్ వస్తుంది. ఆ పిన్ కూడా ఏటీఎంలో ఎంటర్ చేయాలి. మీకు కావాల్సిన అమౌంట్ డ్రా చేయొచ్చు.

నగదు ఉపసంహరణ కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఎస్‌బీఐ యోనో యాప్ క్యాష్ పిన నెంబర్ 30 నిమిషాలు మాత్రమే చెల్లుతుంది. ఎస్బిఐ ఖాతాదారులకు సమీప యోనో క్యాష్ పాయింట్లను గుర్తించే అవకాశాన్ని కూడా యోనో యాప్ అందిస్తుంది. ప్రతీ ఎస్‌బీఐ ఏటీఎంలో ఈ సౌకర్యం ఉండదు. ఎంపిక చేసిన ఏటీఎంలో మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. మీరు కనీసం రూ.500 నుంచి రూ.10,000 మాత్రమే సింగిల్ ట్రాన్సాక్షన్‌లో డ్రా చేయొచ్చు. యోనో క్యాష్ ఫెసిలిటీ ఉపయోగించడం ద్వారా మీరు ఛార్జీలు లేకుండా ఎన్నిసార్లైనా డబ్బులు డ్రా చేయొచ్చు. కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్స్ ఎంచుకుంటే ఛార్జీలను తప్పించుకోవచ్చు.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం మన ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్(Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవలు, సాంకేతిక పరిజ్ఞానంకు సంబందించిన తాజా వీడియోల కోసం మన యూట్యూబ్(YouTube) ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles