AC Buying Guide 2024 in Telugu: మండు వేసవి కాలంలో ప్రజలు కొత్త ఎయిర్ కండీషనర్లను కొనేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుత ఉక్కపోతను తట్టుకోవాలంటే ఫ్యాన్ గాలి సరిపోదు.. ఏసీలు తప్పక కొనాల్సిందే. అందుకే ఎక్కువ మంది వినియోగదారులు ఏసీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు కంటే ఎక్కువ నమోదు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కొత్త AC కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని ఏసీ కంపెనీలు తమ ఉత్పత్తుల మీద ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి.
(ఇది కూడా చదవండి: Google Maps: మీ కుటుంబ సభ్యుల లోకేషన్‌ని గూగుల్ మ్యాప్స్‌లో ట్రాక్ చేయండి ఇలా..?)
మీరు కొత్త ఏసీ కొనుగోలు ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. కొన్ని రకాల ACలు చిన్న గదులలో మాత్రమే బాగా పనిచేస్తాయి. అదే, పెద్ద గదుల్లో మరో ఏసీ అవసరం పడొచ్చు. అందుకే, మీరు మీ కొత్త AC కొనుగోలు చేయడానికి ముందు ఈ పది విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. అవేంటో ఓసారి తెలుసుకుందాం..
మీ బడ్జెట్ పరిధిలోనే ఏసీ కొనండి:
మీరు మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ ఏసీ కోసం ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీరు ముందుగా అనుకున్న బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అదే పరిధిలో అందుబాటులో ఉన్న ఏసీలను కొనుగోలు చేస్తే మంచిది.
ఆన్‌లైన్‌లో ధరలను చెక్ చేయండి:
మీరు మీ ACని ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసేందుకు వెళ్లేటప్పుడు డీలర్ మీకు మోడల్‌ని సిఫార్సు చేస్తారు. అందుకే కొనడానికి వెళ్ళడానికి ముందు ఆ ఏసీ ధరను ఆన్‌లైన్‌లో చెక్ చేయడం మాత్రం గుర్తుంచుకోండి. అదే AC ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంటే బుక్ చేసుకోవడం చాలా మేలు.
మీ ఇంటి గది పరిమాణం ఎంతో తెలుసుకోండి:
మీ ఇంట్లో భారీ హాలులో 1 టన్ను AC ఏ విధంగా మంచిది కాదో, అదే విధంగా చిన్న గదిలో 2 టన్నుల ఏసీ పెట్టుకోవడం నిరుపయోగం. అందుకే మీరు AC కొనుగోలు చేసేటప్పుడు మీ గది పరిమాణాన్ని గుర్తుంచుకోండి. సాధారణంగా 100 లేదా 150(Square Feet) చదరపు అడుగుల గదికి 1 టన్ను AC సరిపోతుంది.
అదే మీ రూమ్ పరిమాణం 150 నుంచి 250 (Square Feet) చదరపు అడుగుల వరకు ఉంటే 1.5 టన్ను గల ఏసీ కొనుగోలు చేస్తే మంచిది. ఇంకా మీ గది పరిమాణం ఎక్కువగా ఉంటే 2 టన్ను గల ఏసీ కొనుగోలు చేయడం మేలు.
ఇంటి గది పరిమాణం కొలవడం ఎలా..?
సాదారణంగా గది పరిమాణాన్ని చదరపు అడుగులలో కొలుస్తారు. ఉదాహరణకు 180 చదరపు అడుగుల గది పరమాణం అంటే మీ గది పొడువు 12 ఫీట్, వెడల్పు 15 ఫీట్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు
గది పరిమాణం = పొడవు * వెడల్పు = 12(Feet) * 15(Feet) = 180 (Square Feet) చదరపు అడుగులు అనే విషయం గుర్తుంచుకోవాలి.
మీ ఇంటి ఫ్లోర్ ఎక్కడ అనేది ముఖ్యం:
మీరు అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటే AC కొనుగోలు చేసేటప్పుడు ఇంటి అంతస్తు కూడా చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు అపార్ట్‌మెంట్‌లో పై భాగంలోని అంతస్తు భవనం పైకప్పు కింద ఉంటే ఆ గది మరింత వేడిగా ఉంటుంది. అందువల్ల, పై అంతస్తులో కూలింగ్ కావాలంటే మీకు సాధారణం కన్నా పెద్ద, పవర్‌ఫుల్ గల ఏసీ అవసరం.
స్ప్లిట్ లేదా విండో ఏసీ ఏది బెస్ట్ ఎంచుకోండి:
సాధారణంగా.. స్ప్లిట్ లేదా విండో AC కూలింగ్ మధ్య చాలా తేడా ఉండదు. స్ప్లిట్ ఏసీలతో పోల్చితే విండో ఏసీలు కొంచెం చౌకగా ఉంటాయి. మరోవైపు, స్ప్లిట్ ఏసీలు ఎక్కడైనా సెట్ అవుతాయి. అయితే, మీకు విండో ఏసీని అమర్చడానికి సరైన పరిమాణంలో కిటికీ ఉండాలని గుర్తుంచుకోండి.
అంతేకాదు.. విద్యుత్ ఆదా, సౌండ్, కూలింగ్ సమయం కూడా తెలుసుకోవాలి. విండో ACలు ఎక్కువ పవర్ ఆదా చేస్తున్నప్పుడు.. స్ప్లిట్ ACలు ఎలాంటి సౌండ్ చేయవు. ఎక్కువ పరిమాణంలో చల్లని గాలిని బయటకు పంపడం వలన వేగంగా కూల్ అవుతాయి.
ఏసీలో కాయిల్ గురించి అడిగి తెలుసుకోండి:
చాలామంది వినియోగదారులు ఏసీని కొనే ముందు ఈ ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతుంటారు. ACలో ఉపయోగించే కాయిల్ టైప్ గురించి అడగండి. రాగి కాయిల్ చాలా సులభంగా ఉంటుంది. రిఫేర్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. అంతే వేగంగా కూల్ అవుతుంది.
ఏసీకి ఎన్ని స్టార్లు ఉన్నాయో చూడండి:
ఎయిర్ కండీషనర్లకు ISEER ఇచ్చే రేటింగ్ చాలా ముఖ్యం. ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు తక్కువ విద్యుత్‍ను వాడుకుంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. 2 స్టార్ ఏసీతో పోలిస్తే 5 స్టార్ రేటింగ్ ఉండే ఏసీ తక్కువ విద్యుత్‍ను వినియోగిస్తుంది.
AC కొన్న తర్వాత సర్వీసు సపోర్టు:
మీరు ఏసీని కొనుగోలు చేసిన తర్వాత ఏదైనా సమస్య వస్తే సర్వీసు సపోర్ట్ అనేది చాలా ముఖ్యం. అప్పుడప్పుడు ఏసీలో వచ్చే సమస్యలకు రిఫేర్లు చేయవలసి ఉంటుంది. మీరు డీల్ చేసే బ్రాండ్ సేల్స్ తర్వాత సర్వీసులను సక్రమంగా అందిస్తున్నాయా లేదో పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది.
మార్కెట్ జిమ్మిక్కులకు లొంగకండి:
ఏ బ్రాండ్ మార్కెటింగ్ జిమ్మిక్కులకు లొంగకండి. వై-పై ద్వారా కంట్రోల్ చేసే ఏసీలను కొనుగోలు చేయడంపై కాదు.. ఇతర ‘కూల్’ ఫీచర్‌లు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి.
కంట్రోలింగ్ వంటి ప్రైమరీ ఫంక్షన్‌ల గురించి పెద్దగా అవసరం లేదు. ఏసీ కూలింగ్ కెపాసిటీ ఎంత అనేది సేల్స్ తర్వాత సపోర్టు ఎలా ఉంటుంది అనే వాటిపై మరింత దృష్టి పెట్టాలి.