Friday, December 6, 2024
HomeHow ToHow to Know PTIN Number: తెలంగాణలో పీటీఐఎన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

How to Know PTIN Number: తెలంగాణలో పీటీఐఎన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

How to Get Telangana PTIN Number Online: మనం ప్రాపర్టీ ట్యాక్స్’కు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఈ ఆస్తి పన్ను(Property Tax) అంటే ఒక ఇంటి యజమాని తన దగ్గరలోని స్థానిక సంస్థ లేదా మునిసిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన ఒక వార్షిక పన్ను.

పీటీఐఎన్ నెంబర్ అంటే ఏమిటి?

ఒక ఇంటి యజమాని తన దగ్గరలోని స్థానిక సంస్థ లేదా మునిసిపల్ కార్పొరేషన్‌కు వార్షిక పన్ను చెల్లించడం కోసం ఆ ఆస్తికి ప్రభుత్వం కేటయించిన నెంబర్’నే పీటీఐఎన్ నెంబర్(Property Tax Identification Number) అని అంటారు.

(ఇది కూడా చదవండి: ఆస్తి పన్ను అంటే ఏమిటి? తెలంగాణలో ఆస్తి పన్ను ఎంతో తెలుసా..!)

పీటీఐఎన్ నెంబర్ కలిగి ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు?

ఇంటి యజమాని పీటీఐఎన్ నెంబర్ తెలుసుకోవడం వల్ల ప్రతి ఏడాది తాను ప్రభుత్వానికి ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోవచ్చు.

తెలంగాణలో పీటీఐఎన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

  • మొదట జిహెచ్ఏంసి అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత Our Services అనే ఆప్షన్ కింద Property Tax ఎంచుకోండి.
  • ఇప్పుడు జిహెచ్ఏంసి ఎంచుకొని Know Your Property Details మీద నొక్కండి.
  • ఇప్పుడు మీ ప్రాంత సర్కిల్ ఎంచుకొని మీ ఇంటి పక్క కామన్ డోర్ నెంబర్ నమోదు చేయండి.
  • ఆ తర్వాత మీ పేరుతో గల పీటీఐఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు.

పైన చెప్పిన పద్దతి కేవలం జిహెచ్ఏంసి పరిధిలో గల ఆస్తులకు వర్తిస్తుంది.

- Advertisement -

సీడీఎంఏ పరిధిలో గల ఆస్తుల పీటీఐఎన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా..?

  • సీడీఎంఏ అధికారిక పోర్టల్ ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు Search Your Property Tax అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత మీ జిల్లా, ULB ఎంచుకోండి.
  • Name of Owner విభాగంలో మీ పేరు నమోదు చేయండి.
  • Door No విభాగంలో డోర్ నెంబర్ ఎంటర్ చేయండి.

పైన చెప్పిన పద్దతి జిహెచ్ఏంసి పరిధి కాకుండా ఇతర మున్సిపల్ ప్రాంతాలలో గల ఆస్తులకు వర్తిస్తుంది.

(ఇది కూడా చదవండి: Vacant Land Tax: వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఏమిటి?)

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles