Friday, March 29, 2024
HomeTechnologyMobilesకొత్త మొబైల్ కొనేటప్పుడు కచ్చితంగా ఈ అంశాలు పరిశీలించండి!

కొత్త మొబైల్ కొనేటప్పుడు కచ్చితంగా ఈ అంశాలు పరిశీలించండి!

మొబైలా ప్రపంచంలో రోజు రోజుకి సరికొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. అయితే మనకు ఆ టెక్నాలజీలు చూడగానే ఆ ఫోన్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. కానీ మనం ఫోన్ కొనే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనం ఫోన్ కనీసం ఒక ఏడాది పైబడి ఉంటేనే ఫోన్ కొనడానికి సిద్దపడాలి. మీరు కనుక ఇటీవలే మొబైల్ కొంటే మళ్ళీ తీసుకోవడం డబ్బులు వృదా చేయడమే అవుతుంది. ప్రస్తుతం మీరు వాడుతున్న ఫోన్ కంటే మెరుగైన అంశాలు ఉన్నపుడు లేదా కనీసం ఇప్పుడు చెప్పబోయే వాటిలో కొన్ని ఉన్నా కూడా మీరు కొత్త మొబైల్ కొనుగోలు చేయవచ్చు.

ప్రాసెసర్ మరియు ర్యామ్

ప్రాసెసర్ అనేది మన మొబైల్ కి అన్నిటికంటే ముఖ్యమైనది మనకు గుండె ఎలాగో మొబైల్ కి ప్రాసెసర్ అలాగా అన్నమాట. కావున మీరు కొత్త మొబైల్ తీసుకునేటప్పుడు ఇప్పుడు ఉన్నా ప్రాసెసర్ కంటే మెరుగైన ప్రాసెసర్, బ్యాటరీని ఆదా చేసే ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే అధిక ర్యామ్ గల మొబైల్ ని తీసుకుంటే మంచిది. చెప్పాలంటే ప్రస్తుతం మంచి పనీ తిరుగల క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865, స్నాప్ డ్రాగన్ 832G, మీడియా టెక్ హీలియో G80 ప్రాసెసర్ లు కలిగి ఉన్నా ఫోన్ లు మార్కెట్ లో చాలా అందుబాటులో ఉన్నాయి.

సరికొత్త కెమెరా టెక్నాలజీ

ప్రాసెసర్ తర్వాత మనం చూడాల్సింది ఫోన్ కెమెరా ఎందుకంటే ప్రస్తుత కాలంలో సెల్ఫీ లు తీసుకోడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. అందుకోసమే మనం వాడుతున్న ఫోన్ కంటే మెరుగైన టెక్నాలజీతో 3 కెమెరా ఉన్నా ఫోన్ తీసుకోవటం మంచిది. ఇందులో డెప్త్ సెన్సర్, వైడ్ యాంగిల్ సెన్సర్, పోట్రైట్ ఫోటో లను తీసుకోవచ్చు. అలాగే కెమెరా మెగా పిక్సల్ అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. ప్రైమరీ కెమెరాలో 3 కెమెరాలు, సెల్ఫీ కెమెరాలో 2 కెమెరాలు ఉంటే మంచిది. ఎక్కువ శాతం సోనీ, శాంసంగ్ సెన్సర్ లు ఫోన్ లు తీసుకోండి.

- Advertisement -

బ్యాటరీ లైఫ్

కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకునేటప్పుడు పరిగణించవలసిన ముఖ్యమైన లక్షణాలలో బ్యాటరీ లైఫ్ ఒకటి. చాలా మంది ఎక్కువ బ్యాటరీ ఉంటే ఎక్కువ బ్యాటరీ లైఫ్ వస్తుందని మోసపోతారు కానీ అది నిజం కాదు. బ్యాటరీ లైఫ్ అనేది వివిద అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదా: మీ ఫోన్ యొక్క  రిజల్యూషన్ అధికంగా ఉన్నా స్క్రీన్లు ఎక్కువ బ్యాటరీ శక్తిని వినియోగిస్తాయని మీరు తెలుసుకోవాలి, అయితే తాజా ప్రాసెసర్లు బ్యాటరీ జీవితాన్ని మెరుగుపరచడానికి ఆప్టిమైజ్ చేస్తాయి. మీరు మీ ఫోన్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్లు మరియు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి తీసుకునే ముందు ఆలోచించండి. మనం స్పెసిఫికేషన్స్ విడివిడిగా చూసెకంటే అన్నీ కలిపి ఎలా పనిచేస్తాయో తెలుసుకుంటే మంచిది.  బెంచ్ మార్క్ ప్రకారం మన ఫోన్ సామర్థ్యం కనీసం 4,000 mAh సామర్థ్యం ఉండాలి.

ఆపరేటింగ్ సిస్టమ్

ఇది కూడా మనం ఫోన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలలో ఒకటి. మనం ప్రస్తుతం వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్ మెరుగైన ఆపరేటింగ్ సిస్టమ్ గల ఫోన్ తీసుకోవాలి. కనీసం ఆండ్రాయిడ్ వెర్షన్ 10 ఉండేటట్లు చూసుకోవడం మంచిది. దీనిలో నెల నెల వచ్చే సెక్యూరిటీ patch లను ఇనస్టాల్ చేసుకోండి.

స్క్రీన్ రిఫ్రెష్ రేట్

- Advertisement -

ప్రస్తుతం 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్నా ఫోన్లు తగ్గి పోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో గేమింగ్ మరియు స్మూత్ స్క్రోలింగ్ కోసం 90 Hz, 120 Hz, 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఫోన్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి కనీసం మన ఫోన్ యొక్క 60 Hz కన్నా ఎక్కువ ఉండేటట్లు చూసుకోవడం మంచిది.

తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles