ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదనే విషయం మనకు తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడి మొబైల్ ని కొనుకుంటాం. ఈ ఫోన్ తీసుకునే ముందు చాలా మంది కెమెరా, ప్రాసెసర్, స్క్రీన్ సైజ్, బ్యాటరీ సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటాం. అన్నిటికంటే ఎక్కువగా బ్యాటరీ ఉన్నా ఫోన్ ని ఇష్టపడుతం. మనలో చాలా మందికి అలాంటి బ్యాటరీ విషయంలో చాలా సందేహాలు, అపోహాలుంటాయి. వాటిలో కొన్ని నిజాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
- మనలో చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న మనం ఫోన్ ని రాత్రి మొత్తం ఛార్జింగ్ పెడితే పేలి పోతుందని, మంటలు వస్తాయని పెద్ద అపోహ ఉంటుంది. కానీ అది తప్పు ఎందుకంటే మన ఫోన్ ని రాత్రంతా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ ఎప్పటికీ ఓవర్‌ఛార్జింగ్ కాదు. బ్యాటరీ తయారీ చేసే నిపుణులు తెలిపిన ప్రకారం.. మన ఫోన్ అనేది ఎప్పటికీ ఓవర్ ఛార్జింగ్ కాకుండా ఉండటానికి బ్యాటరీ 100 శాతం చేరుకోగానే ఆగిపోయేలా ఫోన్ లో ఒక నిర్వహణ వ్యవస్థ ఉంటుంది. దాని వల్ల ఓవర్ ఛార్జింగ్ అవకాశం, మొబైల్ పేలి పోయే అవకాశం ఉండదు. కానీ మనం మన బ్యాటరీ ని ఎప్పుడు 100 శాతం వరకు ఛార్జింగ్ చేయకపోవడం మంచిది ఎందుకంటే 100 శాతం వరకు ఛార్జింగ్ చేస్తే మన ఫోన్ బ్యాటరీ పైన తీవ్ర ఒత్తిడి అనేది ఉంటుంది. అందుకోసమే ఎలక్ట్రిక్ వాహన తయారీ దారులు కొత్త బ్యాటరీలను 80% వరకే ఛార్జింగ్ చేస్తారు. అందుకే మనం కూడా ఎక్కువ శాతం 80 శాతం వరకే బ్యాటరీని ఛార్జింగ్ చేస్తే మంచిది.(చదవండి: కొత్త ఓటర్ కార్డు కోసం ఇంట్లో నుండే ధరఖాస్తు చేసుకోవడం ఎలా ..?)
- మనం సాదారణంగా మన ఫోన్ లో బ్యాటరీ సున్నా శాతం వరకు వచ్చే వరకు వాడుతుంటాం, దీని వల్ల మన బ్యాటరీ లెవెల్ 20% కన్నా తక్కువ ఉన్నపుడు అదిక రేడియేషన్ వెలువడే ప్రమాదం ఉంది. అలాగే, ఛార్జింగ్ పూర్తిగా తీసేయడం వల్ల దాంట్లో రసాయన చర్యలు జరిగి బ్యాటరీ జీవిత కాలం తగ్గే అవకాశాలుంటాయి. అందుకనే మన ఫోన్ బ్యాటరీ వ్యవస్థ అనేది సున్నా ఛార్జింగ్ కాక ముందే స్విచ్ ఆఫ్ అయ్యేలా ఒక వ్యవస్థ ఉంటుంది. దీని వల్ల మన బ్యాటరీ భద్రంగా ఉంటుంది. ఇంకా మన బ్యాటరీ లైఫ్ అనేది పెరగాలంటే బ్యాటరీ శాతం 30% తక్కువ కాకుండా మరియు 80% శాతం మించకుండా ఛార్జింగ్ చేస్తే మంచిది.
- మన ఫోన్ యొక్క ఛార్జర్లు పాడైపోయినప్పుడు లేదా వేరే పనుల మీద వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఇతర కంపెనీలకు చెందిన ఛార్జర్లు వాడుతుంటాం. దీని వల్ల కూడా బ్యాటరీ పాడు అవుతుందని ఒక అపోహ ఉంటుంది. కానీ ఇలా చేయడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉండదు. వేరే ఛార్జర్లు ఉపయోగించడం వలన ఫోన్ అంత త్వరగా ఛార్జ్ అయ్యే అవకాశం ఉండదు. అందుకనే మన ఫోన్ ఛార్జింగ్ అనేది తొందరగా కావాలంటే మీ మొబైల్ కంపెనీకి చెందిన ఛార్జర్‌ను వినియోగించడం మంచిది.
- ఎండకాలం వచ్చింది అంటే ప్రతి ఒకరిని వేదించే సమస్య బ్యాటరీ తీవ్రంగా వేడెక్కడం. దీని వలన బ్యాటరీ లైఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. అందుకోసమే మనం ఎక్కువ శాతం అధిక ఉష్ణోగ్రతలు, ఎండలకు ధూరంగా ఉంటే మంచిది. ఈ వేడి సమస్య వల్ల కొన్ని సార్లు బ్యాటరీ పేలే అవకాశం ఉంటుంది. బ్యాటరీ టెక్నాలజీ నిపుణులు తెలిపన ప్రకారం 80డిగ్రీల ఫారన్‌హీట్(30డిగ్రీల సెల్సియస్) ఉష్ణోగ్రత దాటితే బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంటుంది.(చదవండి: కొత్త ఓటర్ కార్డు కోసం ఇంట్లో నుండే ధరఖాస్తు చేసుకోవడం ఎలా ..?)
- సాదారణ మొబైల్ చార్జర్ ల నుండి 5 నుంచి 10 విద్యుత్ ఔట్ పుట్ వస్తుంది. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ యొక్క సామర్థ్యం దీనికు 8 ఇంతలు ఎక్కువగా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్ టెక్నాలజీలో రెండు దశలలో ఫోన్ ఛార్జింగ్ అవుతుంది. మొదటి దశలో 10 నుంచి 30 నిమిషాల్లో 50 నుంచి 70 శాతం బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. మొదటి దశలో బ్యాటరీ ఏ ఇబ్బందులు లేకుండా ఛార్జింగ్‌ను తీసుకుంటుంది. అందుకే ఇంత వేగంగా ప్రక్రియ జరిగేలా చూస్తారు. తర్వాత దశలో చివరి 20-30 శాతానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. రెండో దశలో ఇలా చేయడం వల్ల హైవోల్టేజీతో బ్యాటరీని దెబ్బతినకుండా చూస్తారు. అందుకే ఫాస్ట్ ఛార్జర్లు ఫోన్ బ్యాటరీని పాడు చేయవు.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.