మీరు టైటిల్ గమనించినప్పుడే మీకు అర్దమయ్యి ఉంటుంది.. మనం ఇవ్వాళ దేని గురుంచి తెలుసుకోబోతున్నామో. అదేనండి మనం ఆన్లైన్ లో Whatsappలో మనం మెస్సేజ్ టైపు చేసి పంపేటప్పుడు మనకు దాని కింద గ్రీన్ డాటెడ్ సింబల్స్ బ్లింక్ అవుతాయి అంటే దాని అర్దం ఇతరులు మనతో మెస్సేజ్ టైపు చేస్తున్నారని. ఇలా టైపు చేసి పంపే ముందు అవతలి వారికి మనం టైపు చేస్తున్న విషయం తెలిసి పోతుంది. ఇలా తెలవకుండా ఉండటానికి లేదా టైమ్ స్టాంప్ పడకుండా ఉండటానికి ఈ క్రింది విదంగా చేయండి.
ఇదేమి కష్టమైన పద్దతి కాదు చాలా సులువైనది.. Whatsappలో మనం రిప్లే టైపు చేసేటప్పుడు అవతలి వారికి కనిపించ ఉండాలంటే, ముందుగా మన మొబైల్ లోని ఇంటర్నెట్(Internet) కనెక్షన్ ను డిజేబుల్ చేయండి. ఆ తర్వాత మీరు ఎవరికైతే చాట్ చేయాలని అనుకుంటూన్నారో వారికి Whatsappలో రిప్లై ఇచ్చి అప్లికేషన్ ను క్లోజ్ చేయండి. ఆ తర్వాత మీ ఇంటర్నెట్ కనెక్షన్ Enable చేయండి అప్పుడు Whatsapp అప్లికేషన్ సంబందిత కాంటాక్ట్ కి ఆటోమేటిక్ గా రిప్లై వెళ్తుంది. అక్కడ మీరు ఎప్పుడు చూసింది, చాట్ చేసింది కనిపించదు.
Android 7 ఆపరేటింగ్ సిస్టమ్, ఆ తర్వాత వెర్షన్స్ వాడుతున్నవారు ప్రత్యేకంగా Whatsapp అప్లికేషన్ ఓపెన్ చేయకుండానే నోటిఫికేషన్ స్క్రీన్ మీద వచ్చిన ప్రదేశం నుండి చాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఆన్లైన్ లో ఉన్నా విషయం, మీరు చాట్ చేస్తున్న విషయం అవతలి వాళ్ళకి తెలియకుండా ఉండాలంటే.. Whatsapp అప్లికేషన్ ఓపెన్ చేసి టైపు చేయడం కాకుండా, మీకు నోటిఫికేషన్ వచ్చిన ఏరియా నుండి రిప్లై ఇవ్వండి. దాంతో మీరు ఆన్లైన్ లో ఉన్నా విషయం వారికి తెలియదు.
ఈ టెక్ టిప్ అనేది చాలా మంది ఉద్యోగులకు, లవర్స్ కి చాలా భాగా ఉపయోగ పడుతుంది.