Friday, December 6, 2024
HomeTechnologyPC/Laptopమీ G-Mail పాస్ వర్డ్ మర్చిపోయారా? భాదపడకండి వెంటనే ఇలా చేయండి..?

మీ G-Mail పాస్ వర్డ్ మర్చిపోయారా? భాదపడకండి వెంటనే ఇలా చేయండి..?

ప్రస్తుత ప్రపంచంలో ఇంటర్నెట్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ G-mail అకౌంటు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి మన అది అవసరం కూడా చాలా సందర్భాలలో మనం దానిని వాడుతుంటాం.. అయితే కొన్ని సందర్బాలలో మన జీ-మెయిల్ అకౌంటు యొక్క పాస్ వర్డ్ మరచిపోవడం అనేది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఒక సారి జరుగుతుంది. అలాంటి సందర్భాలలో మనం టెన్షన్ పడకుండా ఈ క్రింది విదంగా చేసినట్లయితే.. మన అకౌంట్ పాస్ వర్డ్ తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

మీ జీ- మెయిల్ పాస్ వర్డ్ ను మర్చిపోతే ఎలా తెలుసుకోవాలి?

Step 1: మొదట మీ జీ-మెయిల్ పేజీని తెరవండి.

Step 2: ఇప్పుడు మీ ఈ- మెయిల్ ని ఎంటర్ చేశాక కింద ఉన్నా “Forget Password” పై క్లిక్ చేయండి.

Step 3: ఇప్పుడు మీరు మీకు గుర్తు ఉన్నా చివరి పాస్ వర్డ్ ను టైపు చేయండి. మీకు చివరి పాస్ వర్డ్ గుర్తులేకపోతే “Try Another Way(మరో మార్గాన్ని ప్రయత్నిచండి)” ని ఎంచుకోండి.

Step 4: మీ జీ-మెయిల్ ఖాతాకు లింకు చేయబడిన ఫోన్ నెంబర్ కు గూగుల్ మెసేజ్ వస్తుంది.

- Advertisement -

Step 5: మీకు ఫోన్ నెంబర్ కూడా లేకపోతే, మీరు ఇచ్చిన ప్రత్యామ్నాయ ఈ-మెయిల్ కు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది.

Step 6: మీకు ప్రత్యామ్నాయ ఈ-మెయిల్ కూడా లేక పోతే “Try Another Way” ని ప్రయత్నిచండి.

Step 7: ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్నా మరో ఈ-మెయిల్ ని ఎంటర్ చేయండి.

Step 8: ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ-మెయిల్ కి మెసేజ్ వస్తుంది. దానిలో ఉన్నా ఇన్ బాక్స్ పేజీని తెరవండి. అక్కడ ఉన్నా గూగుల్ వెరిఫికేషన్ కోడ్ ను మీకు వేరే ట్యాబ్ లో కనిపిస్తున్న దాంట్లో కోడ్ ఎంటర్ చేయండి.

Step 9: ఇప్పుడు రికవరీ మెయిల్ లో కొత్త మెయిల్ ఎంటర్ చేస్తే దానికి 3 to 5 రోజుల తర్వాత వచ్చిన మెయిల్ ద్వారా కొత్త పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ అలర్ట్ వస్తుంది. 

- Advertisement -

Step 10: రికవరీ అయిన తర్వాత, కొత్త పాస్ వర్డ్ ఉపయోగించి మీ జీ-మెయిల్ కి లాగిన్ అవ్వండి.

ఇలాంటి సందర్భాలను ఎదుర్కోకుండా ఉండటానికి ఎక్కడైనా పత్రం మీద రాసుకోండి. అలాగే వెంట వెంటనే పాస్ వర్డ్ అనేది ఛేంజ్ చేయకండి… అలా చేస్తే పాస్ వర్డ్ మర్చిపోయే అవకాశాలు ఎక్కువ.

- Advertisement -

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles