వాట్సప్ లో మనం చాలా గ్రూప్ లలో ఉండటం వల్ల అందులో వచ్చే ఫైల్స్, ఫోటోస్, వీడియోస్ వల్ల మన ఫోన్ స్టోరేజ్ అనేది ఎప్పుడు నిండి పోతుంది. దీని వల్ల మనం చాలాసార్లు అసౌకర్యానికి గురిఅవుతాం. అయితే, వాట్సప్‌లో ఫైల్స్ డౌన్‌లోడ్, మేనేజ్‌మెంట్ సరిగ్గా చేస్తే స్టోరేజ్ సమస్య వీలైనంతవరకు చెక్ పెట్టవచ్చు. దీనికోసం మనం కొన్ని టిప్స్ ని ఫాలో కావాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
- ముందుగా మనం వాట్సప్ లో ఉన్నా సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి. అందులో మీకు కనిపించే డేటా స్టోరేజ్ యూసేజ్ పైన క్లిక్ చేయండి. అక్కడ మీకు ఆటో డౌన్లోడ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. అందులో కూడా మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి.
- అ) మొబైల్ డేటా(When using mobile data),
- ఆ) వై- ఫై కనెక్ట్(When Connected on wi-fi), ఇ) రోమింగ్(When Roaming) అని ఉంటాయి. ప్రతి దాంట్లో ఉన్నా ఫోటోస్, ఆడియోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ బాక్సుల్ని ఆన్ చెక్ చేసి ఓకే సెలెక్ట్ చేయండి. దీని ద్వారా మన వాట్సప్ స్టోరేజ్ చాలా వరకు తగ్గుతుంది.
- మన వాట్సప్ లో స్టోరేజ్ ఫుల్ ఎందుకు అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మనం వాట్సప్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి డేటా అండ్ స్టోరేజ్‌పైన క్లిక్ చేసి Storage usage పైన క్లిక్ చేయండి. అందులో మీకు ఏ గ్రూప్ వలన లేదా చాటింగ్స్ వల్ల స్టోరేజ్ ఫుల్ అవుతుందో తెలుస్తుంది. ఆ ఛాట్‌లోకి వెళ్లి అవసరం లేని ఫైల్స్ లేదా డేటాని డిలిట్ చేయొచ్చు.
- మీ వాట్సప్ డేటాను తక్కువ ఉపయోగించేందుకు కోసం ఇలా చేయండి. మీ వాట్సప్ సెట్టింగ్ లో డేటా అండ్ స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. కాల్ సెట్టింగ్స్ లో Low Data Usage ఆప్షన్ ని ఎనేబుల్ చేయండి. దీని వల్ల మీ డేటా తక్కువ ఖర్చు అవుతుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని Subscribe చేసుకోండి.