మనం ఎప్పుడో ఒకసారి తెలియకుండా sms మెసేజ్ లు, ఇతర డేటాను డీలిట్ చేస్తూ ఉంటాం. అందులో మనకు కావలసిన అతి ముఖ్యమైన సమాచారం ఉంటే తిరిగి పొందటం ఎలా అని చాలా భాదపడుతుంటాం. అయితే వాటిని తిరిగి పొందాలంటే చాలా రకాల పద్దతులున్నాయి.
థర్డ్ – పార్టీ రికవరీ టూల్స్ ద్వారా
మనం డీలిట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది థర్డ్- పార్టీ రికవరీ టూల్స్ వాడటం! ఇది కొంచెం రిస్క్ తో కూడుకున్నది. Disk Dril అనేది ఆ రికవరీ టూల్స్ కి సంబందించిన వాటిలో ఒక అప్లికేషన్. ఈ టూల్ ని మీ విండోస్, మ్యాక్ లలో డౌన్ లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ఫోన్ కి కనెక్ట్ చేసి డేటాని పొందవచ్చు. అయితే దీని కోసం మనం మన ఫోన్ రూట్ చేయాల్సి ఉంటుంది. ఈ రూట్ చేయడానికి అంతర్జాలంలో దీనికి సంబందించిన సమాచారాన్ని తెల్సుకోని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది.
అన్నీ ఫోన్లకు రూట్ అనేది ఒకే మాదిరి వీలు కాకపోవచ్చు. ఇలా రూట్ చేయడం వల్ల మొబైల్ కంపెనీ నుండి వచ్చే ఆప్డేట్స్ నిలిచిపోవచ్చు. కొన్ని సార్లు మీ ఫోన్ లో ఏదైనా సమస్య ఏర్పడితే మీ కంపెనీ నుండి సపోర్ట్ కూడా నిలిచిపోవచ్చు. అందువల్ల దీనిని మీ సొంత రిస్క్ మీద రూట్ చేయండి. రూట్ చేసిన తర్వాత మీ ఫోన్ ని మీ విండోస్/మ్యాక్ కనెక్ట్ చేసి డీలిట్ కాబడిన వీడియోలు, మెసేజ్ లు తిరిగి పొందవచ్చు. పాత కాలం డాటాని మాత్రం తిరిగి పొందటానికి ఆస్కారం చాలా తక్కువ.
గూగుల్ బ్యాక్ అప్ ద్వారా
ప్రతి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ గల ఫోన్ లో ఈ సౌకర్యం ఉంటుంది. ఇది ఎప్పటి నుండో అందుబాటులో ఉన్నది అన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పడు మీ ఫోన్ లో Settings>System>Google Backup అనే ఆప్షన్ ని ఎంచుకోవడం ద్వారా దీన్ని వాడుకోవచ్చు. ఇది మన ఫోన్ యొక్క డేటాని ప్రతి 12 లేదా 24 గంటలకి ఒకసారి బ్యాక్ అప్ చేస్తుంది. అందుకని మనం మెసేజ్ డీలిట్ అయిన వెంటనే బ్యాక్ అప్ తో రిస్టోర్ చేసుకుంటే పోయిన డేటా అనేది తిరిగి వెనక్కి వస్తుంది.
తాజా టెక్నాలజీ వార్తలు మరియు ప్రభుత్వ సేవల కోసం, మన యొక్క ట్విట్టర్(Twitter), ఫేస్‌బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) పేజీలను అనుసరించండి. ప్రభుత్వ సేవల మరియు టెక్నాలజీ పరిజ్ఞానం యొక్క తాజా వీడియోల కోసం, మన యూట్యూబ్ (YouTube)ఛానెల్ ని ఇప్పుడే Subscribe చేసుకోండి.